పార్కింగ్ టికెట్ల రీసేల్ ..!


 యాదగిరికొండ: డబ్బు సంపాదించడానికి యా దగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో పనిచేస్తున్న ఓ చిరు ఉ ద్యోగి కొత్తమార్గాన్ని ఎంచుకున్నాడు. కొంతకాలంగా వాహనాల పార్కింగ్ టికెట్లను రీసేల్ చేస్తూ సొమ్ముచేసుకున్నాడు. దేవస్థానం ఆదాయానికి గండిపడుతుండడం, వాహనదారుల ఫిర్యాదుతో తేరుకున్న అధికారులు మంగళవారం ఆ ఉద్యోగిని రెడ్‌హ్యాం డెడ్‌గా పట్టుకున్నారు. వివరాలు.. స్వామి అ మ్మవార్లను దర్శించుకోవడానికి వాహనాలపై వచ్చే భక్తుల సౌకర్యార్థం కొం డపైన 15 ఏళ్ల క్రితం పార్కింగ్ సౌకర్యం కల్పించా రు. అక్కడ పార్క్ చేసే వాహనాలకు రూ.20 తీసుకుని టికెట్ ఇస్తారు. ఇలా దేవస్థానానికి ప్రతి నెలా రూ. 3 లక్షల ఆదాయం సమకూరుతుంది. దీనికి కొండ కింద చెక్‌పోస్టు వద్ద టికెట్ కౌం టర్ ఏర్పాటు చేశారు. అయితే కొంద రు వాహనదారులు కొండ కింద ప ర్కింగ్ టికెట్లు తీసుకోవడం లేదని కొండపైన రెండు కమాన్‌లో కలిసే చోట మరో హోంగార్డుల పర్యవేక్షణ లో మరో కౌంటర్ ఏర్పాటు చేసి దేవస్థానం అటెండర్లను నియమించారు.

 

 వెలుగులోకి ఇలా..

 కొండపైన పార్కింగ్ టికెట్ కేంద్రంలో పనిచేస్తున్న అటెండర్లు పార్కింగ్ టికె ట్లు రీసేల్ చేస్తున్నారని కొందరు వాహనదారులు అధికారులకు ఫిర్యా దు చేశారు. అయితే ప్రతి నెలా దేవస్థానానికి వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గుతుండడాన్ని అధికారులు గమనించారు. ఈఓ గీతారెడ్డి పర్యవేక్షణలో అధికారులు కొద్ది రోజులుగా ఈ తతంగాన్ని సూక్ష్మంగా పరిశీలించారు. మంగళవారం పార్కింగ్ టికెట్ కేం ద్రంలో పనిచేస్తున్న అటెండర్ నర్సి ంహ వద్ద అక్రమంగా ఉన్న 20 టికెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ పార్కింగ్ రీసేల్ లో ఎవరెవరు ఉన్నారనే దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. సదరు అటెండర్‌పై త్వరలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని దేవస్థానం అధికారులు తెలిపారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top