అడవి దొంగలు


ఇచ్చోడ, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ అడవుల్లో పాకిస్తాన్ గిరిజన తెగకు చెందిన ముల్తానీలు అడ్డా వేశారు. కలప అక్రమ రవాణాను జీవనాధారంగా చేసుకున్నారు. అక్రమంగా కలపను తరలించడమే వీరి నైజం. అడ్డొస్తే అటవీశాఖ అధికారులపై కూడా దాడులు చేయడానికి వెనుకాడటం లేదు. కరుడుగట్టిన నేర ప్రవృత్తి కలిగిన వీరిని అడ్డుకునేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితా లు ఇవ్వడం లేదు. ఫలితంగా రూ.కోట్ల విలువ చేసే టేకు కలప జిల్లా సరిహద్దులు దాటుతోంది. గిరిజనులు అడవి తల్లిని నమ్ముకుని జీవ నం కొనసాగిస్తుండగా, ముల్తానీలు మాత్రం అడవులను తె గనరకటం జీవనాధారంగా చేసుకుని అడవితల్లిని క్షోభకు గురి చేస్తున్నారు.



 వలస వచ్చిన ముల్తానీలు

 పాకిస్తాన్ ముల్తాన్ ప్రావిన్స్ రాష్ట్రంలోని ముస్లిం గిరిజన తెగకు చెందిన ముల్తానీలు దాదాపు 60 ఏళ్ల క్రితం వలస వచ్చారు. మహారాష్ట్రలోని కిన్వట్ తాలుక చికిలి, ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలం కేశవపట్నం, గుండాల, ఎల్లమ్మగూడ, జోగిపేట్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీరు దాదాపు వమూడు గ్రామాల్లో దాదాపు 3వేలకుపైగా జనాభా ఉంటారు. స్వాతంత్య్రం రాక ముందు ముల్తాన్ రాష్ట్రం అవిభక్త భారతదేశంలో భాగంగా ఉండేది.





 దీంతో ముల్తానీలు అక్కడి నుంచి కూలీనాలీ చేసుకుంటూ సంచార జీవనం ప్రారంభించారు. పొట్ట చేతబట్టుకుని అడవుల గుండా గుడారాలు ఏర్పాటు చేసుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చారు. పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా అవిర్భవించినా అక్కడికి వెళ్లలేదు. ఇక్కడమే ఐదు ఊళ్లు ఏర్పాటు చేసుకుని కలప  అక్రమ రవాణాను ఉపాధిగా మార్చుకున్నారు. అనాగరికత, నిరక్షరాస్యత, అడవులపైనే ఆధారపడి జీవనం సాగించడంతో మొరటుతనానికి అలవాటు పడ్డారు. దీంతో తమ పనులకు అడ్డువచ్చిన వారిపై దాడులకు పాల్పడడం వీరికి నిత్యకృత్యమైంది.



 పనులన్ని రాత్రివేళల్లోనే..

 ముల్తానీలు రాత్రి సమయంలో అటవీ ప్రాంతానికి వెళ్లి టేకు చెట్లను నరికి కలపను ఇంటికి తెచ్చుకుంటారు. తాము తెచ్చిన దుంగలను ఎండ్ల బండ్లలో రాత్రివేళల్లోనే గ్రామాలకు 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న జాతీయ రహదారి సమీపానికి తీసుకొస్తారు. కనీసం బండినేక బండి 20 నుంచి 30 బండ్లతోపాటుగా 40 మంది ముల్తానీలు బండ్లను అనుసరిస్తు వస్తుంటారు. మరో 10 మంది జాతీయ ర హదారులపై ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ పోలీసులు, అటవీ అధికారుల కదలికలను గమనిస్తారు.



నిజామాబాద్ ప్రాంతానికి చెందిన కలప వ్యాపారులు పం పించిన లారీలు, ఇతర వాహనాల ద్వారా జాతీయ రహదారికి కిలోమీటరు దూరంలోనే ఎడ్లబండ్ల ద్వారా తెచ్చిన కలప దుంగలను లారీల్లోకి ఎక్కిస్తారు. ఇదంతా కూడా అరగంటలోపే జరుగుతుంది. లోడ్ చేసిన లారీల ప్రాంతంలో పోలీసులు కాని అటవీ అధికారులు వెళ్తే రాళ్లు, కర్రలు, దుంగలు, ఆయుధాలతో దాడి చేస్తారు. దీంతో అటవీ సిబ్బంది అటువైపుగా వెళ్లడానికి సాహసించరు. దీంతో కలప సరిహద్దులు దాటిస్తారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు సాహసించి సంఘటన స్థలానికి వెళ్తే కలప లారీలను వదిలి వెళ్లి పారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.



 పోలీసులు, అటవీ శాఖ అధికారుల  మధ్య సమన్వయ లోపం

 ఇచ్చోడ మండలంలోని మూడు గ్రామల్లో నివాసం ఉంటున్న ముల్తానీల ఆగడాలను అరికట్టడం కష్టమే మి కాదు. పోలీస్ ఉన్నతాధికారులు, అటవీశాఖ ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే ముల్తానీ లు రెచ్చిపోతున్నారు. జిల్లాస్థాయి ఉన్నతాధికారులు సమష్టి నిర్ణయాన్ని తీసుకుంటే కలప స్మగ్లర్ల ఆగడాలను అడ్డుకట్ట వేయచ్చని పలువురు భావిస్తున్నారు. కాగా, గత మూడు నెలల్లోనే ఇచ్చోడ పోలీసులు రూ.30 లక్షల విలువ గల కలపను పట్టుకున్నారు. దీంట్లో 1038 కలప దుంగలను స్వాధీనం చేసుకుని, 18 మంది ముల్తానీలపై కేసులు నమోదు చేశారు.



 చెక్‌పోస్టులపైనే అనుమానాలు

 మితిమిరిపోతున్న కలప స్మగ్లర్లు రోజుకు ఒక్క వాహనంలో కలపను జిల్లా సరిహద్దులు దాటిస్తునే ఉన్నా రు. ఇటు ఇచ్చోడ, నేరడిగొండ మండలంలో పోలీసు లు, అటవీ అధికారులు దాడులు నిర్వహించి కలప తరిలిస్తున్న వాహనాలను పట్టుకుంటున్నా కలప రవాణా ఆగడంలేదు. అంటే అధికారులు పట్టుకుం టున్న వాహనాలే కాకుండా సగనికి పైగా కలప వాహనాలు జిల్లా సరిహద్దులు దాటుతోంది. స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న మూల్తానీలు చేస్తున్న జల్సాలే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. నేరడిగొండ మం డలంలోని మొండిగూట్ట, ఇస్‌పూర్ చెక్‌పోస్టు, సోన్ చెక్‌పోస్టుల నుంచి అక్రమంగా కలప తరిలిస్తున్న లారీలను కొందరు అటవీ అధికారులు, సిబ్బంది సహకరిస్తుండటంతోనే ఈ వ్యవహారం సాగుతున్నట్లు సమాచారం.



 స్మగ్లింగ్‌ను నివారించాం..

 ఇచ్చోడ కేంద్రంగా అక్రమ కలప రవాణాను పూర్తిస్థాయిలో నివారించామని ఆదిలాబాద్ డీఎఫ్‌వో శేఖర్‌రెడ్డి అన్నారు. ఇచ్చోడ కేంద్రంగా జరుగుతున్న కలప రవాణాపై ఆదిలాబాద్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు అధికారి తిమ్మరెడ్డిని సాక్షి అడుగగా.. స్థానికంగా ఉండే అధికారులు వివర ణను కోరాలని, అక్కడి సమాచారం తన వద్ద ఉండదన్నారు. దీంతో డీఎఫ్‌వో శేఖర్‌రెడ్డిని అడుగగా.. స్మగ్లింగ్‌ను నివారించామన్నారు. ప్రస్తుతం అక్రమంగా కలప రవాణా జరగడడం లేదన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top