వైఎస్సార్ సీపీతోనే పేదల అభివృద్ధి


ములుగు, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే పేదల అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ములుగు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి లోకిని సంపతితో కలిసి శుక్రవారం ఆయన ములుగు, జంగాలపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.



ఈ సందర్భంగా తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. గ్రామాల్లో పనులు కరువై పట్టణాలకు వలస వెళ్తున్న కూలీలకు ఉపాధిహామీ పథకం, మహిళలకు పావలావడ్డీ రుణాలు, ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కే దక్కుతుందని తెలిపారు.

 

మహానేత ప్రవేశపెట్టిన పథకాల అమలు ఆయన తనయుడు వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమన్నారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకునే వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించిందని ఆయన తెలిపారు. ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి లోకిని సంపతి మాట్లాడు తూ గత పాలకులు నియోజకవర్గ అభివృద్ధిని కాలరాశారని ఆరోపించారు. పేదల కష్టాలను తెలిసిన తనను ఎన్నికల్లో గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతానని చెప్పారు.

 

అనంతరం మండలంలోని జంగాలపల్లి గ్రామానికి చెందిన రేణుకుంట్ల భాస్కర్, గండి మహేష్, గడ్డం క్రాంతికుమార్, గుండె రమేష్, బండారి ప్రశాంత్, రేణుకుంట్ల శ్రీకాంత్, మామిడి కమలాకర్, గుండె విష్ణు, శ్యాం, గుర్రం జాషువాతో పాటు వివిధ పార్టీలకు చెం దిన మరో 50 మంది కార్యకర్తలు ఎంపీ అ భ్యర్థి తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. కార్యక్రమంలో ములుగు జెడ్పీటీసీ అభ్యర్థి దొంగరి మహేందర్, డివిజన్ నాయకులు ఆశోక్‌రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మణ్, మెట్టు సురేష్ పాల్గొన్నారు.

 

షర్మిల రోడ్‌షోను విజయవంతం చేయాలి..

ఎన్నికలను పురస్కరించుకుని నర్సంపేట, మహబూబాబాద్ డివిజన్లలో శనివారం జరుగనున్న వైఎస్సార్‌సీపీ నాయకురాలు షర్మిల రోడ్‌షోను కార్యకర్తలు విజ యవంతం చేయాలని ఆ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు, ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి లోకిని సంపతి పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top