ఉల్లి కోసం లొల్లి


► సిరిసిల్ల రెస్టారెంట్‌లో కస్టమర్లపై దాడి

► బాటిళ్లు..కత్తులతో గాయపర్చిన వైనం

► ఇద్దరికి పాక్షికం..మరొకరికి తీవ్రగాయాలు

► ఏరియాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

► పోలీస్టేషన్ లో పరస్పర ఫిర్యాదులు

సిరిసిల్ల క్రైం : బిర్యాని తినే కస్టమర్లు అదనంగా ఉల్లిపాయలు అడిగినందుకు ఓ రెస్టారెంట్‌ నిర్వాహకులు వారిపై దాడి చేసిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక అంబేద్కర్‌ చౌరస్తాలోని తాజ్‌ రెస్టారెంట్‌లో ముస్తాబాద్‌కు చెందిన ఆసరి దీక్షిత్‌(22) మధ్యాహ్న సమయంలో తన స్నేహితులు విజయ్, నవీ¯ŒSతో కలిసి బిర్యాని తినడానికి వెళ్లారు.

 

స్నేహితులు సరదాగా మాట్లాడుతూ..భోజనం చేస్తుండగా ఇతర రాష్ట్రం నుంచి వచ్చిన వెయిటర్లు ఇంగ్లిష్‌లో దీక్షిత్, అతని స్నేహితులపై కామెంట్‌ చేశారు. అయినా అవేమీ పట్టించుకోకుండా అదనంగా ఉల్లిపాయలు(గ్రీ¯ŒSసలాడ్‌) తేవాలని వెయిటర్‌ను కోరారు. దీనికి వెయిటర్‌ ఒప్పుకోక పోవడంతో అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పారు. అయినా వినకుండా మరిన్ని కామెంట్లు చేశారు. దీంతో దీక్షిత్‌ అతని స్నేహితులు వెయిటర్‌తో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగింది. రెస్టారెంట్‌ సిబ్బంది పదిమంది ముగ్గురు కస్టమర్లను రూంలోకి తీసుకెళ్లి విచక్షణా రహితంగా దాడిచేశారు. గాజుసీసాలతో గాయపర్చారు. తీవ్రగాయాలైన దీక్షిత్‌ను స్థానికుల ప్రమేయంతో ఏరియాస్పత్రికి తరలించారు. విజయ్, నవీన్ కు స్వల్పగాయాలయ్యాయి. జరిగిన సంఘటనపై వీరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈవిషయమై తాజ్‌ రెస్టారెంట్‌ యజమాని తాజ్‌ను వివరణ కోరగా..తాను స్థానికంగా లేనని హోటల్‌లో ముగ్గురు వ్యక్తులు అతిగా మద్యం సేవించి వచ్చి అద్దాలు పగులగొట్టి తమ సిబ్బందిపై దాడి చేసారన్నారు. తాము కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెపాపడు.   
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top