భ్రాంతియేనా!

భ్రాంతియేనా!


జీవనభృతి కోసం సాగుతున్న పోరాటం

మిన్నంటుతున్న బీడీ కార్మికుల నిరసనలు

కార్యాలయూల ముట్టడి: అధికారుల నిలదీత

సర్కారు నుంచి కొత్త మార్గదర్శకాలు విడుదల

రహస్యంగా ఉంచిన డీఆర్‌డీఏ అధికారులు


ప్రగతినగర్  : జీవనభృతి మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించడంతో బీడీకార్మికులు ఎక్కడికక్కడ ఆందోళనబాట పడుతున్నారు.



అర్హత ఉన్నవారికి కూడా భృతిని అందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి పీఎఫ్ ఉన్నవారికే అని, మరోసారి వర్ధీ బీడీ కార్మికులకు కూడా భృతి అని చేస్తున్న అస్పష్ట ప్రకటనలు త మను గందరగోళానికి గురి చేస్తున్నాయని వాపోతున్నారు. విధిలేక నిరసనలు,ధర్నాలు చేస్తున్నారు. అధికారులను అడ్డుకుంటున్నారు. సోమవారం వందల సంఖ్యలో బీడీ కార్మికులు ప్రజావాణిలో వినతిపత్రాలు సమర్పించారు. బుధ, గురువారాలలో పోరాటానికి దిగా రు. ధర్పల్లి ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించా రు. సిరికొండ మండలంలో పింఛన్ పంపిణీ చేస్తున్న అధికారులను అడ్డుకొని నిలదీశారు.



దీంతో అధికారు లు పింఛన్ పంపిణీ నిలిపివేశారు. మాక్లూర్ పోస్టాఫీ స్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒకమాట, గెలిచాక మరోమాట చెబుతూ తమ కడుపులు కొడుతోందని దు య్యబడుతున్నారు. ఇంటిలో అత్తకు వస్తే అవ్వకు రా దని, అవ్వకు వస్తే అయ్యకు పింఛను రాదంటూ పలు నిబంధన విధించి ఇప్పుడు భృతిని బ్రాంతిగా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇలాగైతే తెలంగాణ ఉద్యమంలా బీడీ కార్మికుల మరో ఉద్యమం మొదలవుతుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

 

అవగాహన కరువు

ఇదిలా ఉండగా, ప్రభుత్వం జీవనభృతి పంపిణీ కో సం కొత్త మార్గాదర్శకాలను రూపొందించింది. బయటకు పొక్కితే నిరసనలు తప్పవని ఈ విషయాన్ని రహస్యంగా ఉంచింది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 3,86,544 మందికి పింఛన్ అందిస్తున్నారు. ఇందు లో వృద్ధాప్య 1,22,304, వితంతు 1,11,615, వికలాంగులు 34,352, చేనేత 916, గీత 1,678, బీడి కార్మికులు 1,14,208, ఎయిడ్స్‌వ్యాధిగ్రస్తులు 1,435, అభయహస్తం 9,013 పింఛన్లు ఉన్నాయి. బీడీ కార్మికులందరికీ జీవనభృతి అందిస్తామని ప్రభుత్వం ముందుగా ప్రకటించింది. అయితే, సమగ్ర కుటుంబ సర్వేలో కొందరు తాము బీడీ కార్మికులమని చెప్పినప్పటికీ పీఎఫ్ ఫార్మాట్‌లో నమోదు చేయించలేదు.



అనంతరం పీఎఫ్ నంబరు కలిగిన కార్మికులు తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయూలలో, ప్రజావాణిలో, మున్సిపాలిటీలలో, డీఆర్‌డీఓ  కార్యాలయంలో, కా ర్ఖానాల యాజమాన్యాలకు దరఖాస్తులు అందించా రు. ప్రభుత్వం దరఖాస్తు చేసుకునే విషయంలో సరియైన అవగాహన కల్పించలేదు. దీంతో అసలు దరఖాస్తు ఎలా అందించాలో తెలియక చాలా మంది వివిధ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టారు. చివరకు వచ్చిన దరఖాస్తులను అధికారులు సమగ్ర సర్వే డాటాతో క్రోఢీకరించి పింఛన్లు మంజూరు చేశారు.



అయితే, ఇప్పడు కొత్త చిక్కు వచ్చి పడింది. గుర్తింపు పొందిన కార్ఖానాలలో పని చేస్తూ, పీఎఫ్ నంబరు కలిగి, పీఎఫ్ కట్ అవుతున్నవారికి మాత్రమే భృతి అందించాలని నూతన మార్గదర్శకాలు సెర్ప్ కార్యాలయం నుంచి జారీ అరుునట్టు సమాచారం. ఇంతే కాకుండా కార్మికుల సీనియూరిటీ, ఈపీఎప్‌తోపాటు రిజిస్ట్రేషన్‌ను కూడ పరిగణనలోకి తీసుకుంటున్నారని సమాచారం. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం వర్ధీ బీడీ కార్మికులతొ కలుపుకుంటే 2,70,633 మంది ఉన్నారు.అందులో 1,14,208 మ ందికి భృతిని అందిస్తున్నారు. పీఎఫ్ ఉన్నవారు మరో 25 వేల వరకు ఉండవచ్చని తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top