ఒకటికి పది!


గద్వాలటౌన్ : నగరాలకే పరిమితమైన క్రికెట్ బెట్టింగ్ ఇప్పుడు అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. బెట్టింగ్‌ల స్వరూ పం కూడా మారింది. గతానికి భిన్నం గా ఈ ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఈ ధో రణి విపరీతంగా పెరిగింది. ప్రపంచ కప్ క్రికెట్ ఆరంభమైందంటే క్రికెట్ అ భిమానులు ఎంతలా ఆనందిస్తారో..! ఇప్పుడు అంతకన్నా రెండింతలు బెట్టింగు రాయుళ్లు సంబరపడి పోతున్నారు... చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్న వారి బుర్రకు పదును పెడుతూ.. పందేల మీద పందేలు కాసి సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేస్తున్నారు. వె య్యి రూపాయలు కాస్తే... రెండు వే లు.. మూడు వేలు.. ఇలా బుకీల తరహాలో కొంతమంది ఫోన్ల ద్వారానే చక్రం తిప్పుతున్నారు.



ఆనందంగా ఆ స్వాదించాల్సిన ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్‌లను కొంతమంది దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. లీగ్‌దశ వరకు మోస్తరుగా కనిపించిన బెట్టిం గ్‌లు నాకౌట్ దశలో భారీగా మొదలయ్యాయి. గత వారం నాటి భారత్-బంగ్లాదేశ్, మొన్నటి దక్షిణాప్రికా-న్యూజిలాండ్ మ్యాచ్‌లలో టాస్ నుంచి మొదలు వికెట్లు, ఓవర్లు, బంతులు, బౌండరీలు, సిక్సర్లు ఇలా విడివిడిగా పందేలు నిర్వహించారు. గురువారం జరిగే భారత్-ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్‌కు సంబంధించి ముందస్తు బెట్టింగ్‌లు రెండు రోజుల క్రితమే మొదలయ్యాయి.

 

ఈ ప్రాంతాలలో జోరు...

గద్వాల నియోజకవర్గం వ్యాప్తంగా బె ట్టింగ్‌లు జరుగుతున్నా ప్రధానంగా గద్వాల పట్టణ, ధరూర్, ఐజ ప్రాం తాల్లో పెద్దఎత్తున బెట్టింగ్‌లు సాగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా పట్టణంలోని బీసీ కాలనీ, వేదనగర్, రాజ వీధి, షెరేల్లివీధికి కొంతమంది దళారు లు పెద్దఎత్తున బెట్టింగ్‌లకు దిగుతున్నారు. ఐజ మండల కేంద్రానికి చెం దిన ముఖ్యమైన వ్యక్తి ద్వారా ఈ త తంగం నడుస్తుంది. రాయచూర్, ఆదోని, హైదరాబాద్‌లలో కొంతమంది బెట్టింగ్‌రాయుళ్లతో ఒప్పందా లు కుదుర్చుకున్నారు. ఈ మేరకు పెద్దమొత్తంలో డబ్బును ఆయా బెట్టింగ్ రాయుళ్లతో డిపాజిట్ చేశారు. ప్రతి బె ట్టింగ్‌పై నూటికి 3శాతం చొప్పున క మీషన్ వసూలు చేస్తున్నారు.



బోర్డు ఏ ర్పాటు చేసుకుని బెట్టింగ్‌లు నడుపుతున్నారు. ఒక్కక్కరు బెట్టింగ్‌కు 10-15 సెల్‌ఫోన్‌లు వినియోగిస్తున్నారు. కమీషన్ కోసం పందెపు రాయళ్లను కవ్వి స్తూ ఆహ్వానించే ఈ బెట్టింగ్ వలలో * వెయ్యి మొదలు *లక్ష వరకు కట్టేవారున్నారు. ఒకటికి రెండు చొప్పున మొ దలై 1:10 స్థాయిలోనూ జరుగుతున్నా యి. వీరితో పాటు వేదనగర్‌లోని కొంతమంది జరీచీరల వ్యాపారులు, కృష్ణవేణి చౌరస్తా దగ్గర కొంతమంది యువకులు, మరికొంత మంది వ్యాపారులు పెద్ద మొత్తంలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలిసింది.



ధరూర్ మండల కేంద్రంలో సైతం బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు సైతం బెట్టింగ్‌లకు పాల్పడుతూ జేబులను ఖాళీ చేసుకుంటున్నారు. ఈ పందెంరాయుళ్లకు రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో పోలీసులను సైతం శాసిస్తూ తమ బెట్టింగ్‌లు కొనసాగిస్తున్నారు. పోలీసు అధికారులు బెట్టింగ్ రాయుళ్లపైనా గురిపెట్టి, కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top