వన్ ఫుల్‌మీల్స్


 గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఇక పౌష్టికాహారం లభించనుంది. ఇక విటమిన్లు, ప్రొటీన్లు కలిగిన పౌష్టికాహారం అందనుంది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ‘వన్‌ఫుల్ మీల్స్’ పేరుతో మధ్యాహ్నం వేళ అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ పథకం పేదలకు వరంగా మారనుంది.

 

 వనపర్తి టౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని బాలింతలు, గర్భిణులు, ఆరేళ్లలోపు చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని అరికట్టేందుకు కేంద్రం అంగన్‌వాడీకేంద్రాల ద్వారా బియ్యం, పప్పు, కూరగాయలు, పాలు, గుడ్లతో కూడిన సంపూర్ణ భోజనాన్ని అందించనుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో కేంద్ర మానిటరింగ్ లెవల్ సపోర్టు కమిటీలను పూర్తిచేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు జిల్లా అధికారులు ఇదేవరకే ఆదేశాలు

 జారీచేశారు. ఈ భోజనం పెట్టే పూర్తి బాధ్యతలను వారికే అప్పగించనున్నా రు. జిల్లాలో మొత్తం 20 ఐసీడీఎస్ ప్రా జెక్టులుండగా, 4415 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 566 మినీ కేంద్రాల్లో వన్‌ఫుల్ మీల్స్ పథకాన్ని ప్రారంభిం చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలు రక్తహీనతతో బాధపడుతున్నారు. బాలింతలకు సరైన పౌ ష్టికాహారం లభించకపోవడంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. పిల్లల్లో బుద్ధిమాంద్యం సమస్య ఏర్పడుతోం ది.

 

 ఈ సమస్యలను అధిగమించేందు కు కేంద్రప్రభుత్వం ‘వన్‌ఫుల్ మీల్స్’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలుచేయాలని భావిస్తోంది. అయితే ఇప్పటివరకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం సరుకులను గర్భిణులు, బాలింతల ఇళ్లకు పంపించేవారు. ఈ విధానం ఆశించిన ప్రయోజనం లేకపోవడంతో అంగన్‌కేంద్రాల్లోనే సంపూర్ణ భోజనం పెట్టాలని యోచిస్తున్నారు.

 

 అమలు బాధ్యత

 అంగన్‌వాడీలదే..

 ఇంతకుముందు జిల్లాలోని పలుచోట్ల అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన అమృతహస్తం పథకం అమలును గ్రా మ సమాఖ్యలకు అనుసంధానం చేశా రు. వన్‌ఫుల్ మీల్స్ పూర్తి బాధ్యతలను కూడా అంగన్‌వాడీ ఆయాలు, కార్యకర్తలకు అప్పగించారు. కేంద్రం పేరుమీద బ్యాంకు ఖాతా తెరిచి నిధులు జమచేస్తారు. తద్వారా వారు అవసరమైన స రుకులు కొనుగోలుచేసి భోజనం పెట్టా ల్సి ఉంటుంది. ఆయా కేంద్రాలకు అవసరమైన బియ్యం, నూనె, పప్పు, అధికారులు అందించనున్నారు. మిగతా కూరగాయలు, పాలు, గుడ్లు తదితర బాధ్యతలను అంగన్‌వాడీలకు అప్పగించనున్నారు. ఈ బాధ్యతలను పర్యవేక్షించేందుకు కేంద్రం పరిధిలో ఒక క మిటీని ఏర్పాటు చేస్తారు. దీనికిఅంగన్‌వాడీ కార్యకర్త కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

 

  పర్యవేక్షణకు కమిటీలు

 మునిసిపాలిటీ స్థాయిలో కౌన్సిలర్, గ్రామస్థాయిలో వార్డు సభ్యుడు లేదా సర్పంచ్ కమిటీలో ఉంటారు. కేంద్రం పరిధిలో ఆశ కార్యకర్త, ఇద్దరు తల్లులు(7నెలల నుంచి మూడేళ్ల పిల్లలు కలిగి న తల్లులు), గ్రామస్తులు, ఒక టీచర్, ఒక రిటైర్డ్ ఉద్యోగి, ఇద్దరు కిశోరబాలికలు, మహిళా సంఘాల సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తారు.

 

 అందించే ఆహారం

 200 మిల్లీలీటర్ల పాలు, గుడ్లు, ఆకుకూరలు, 120 గ్రాముల బియ్యం (ఒక్కొక్కరికిరోజుకు), 30 గ్రా ముల కందిపప్పు(ఒక్కొక్కరికి రోజుకు), 16 గ్రాముల మం చినూనె(ఒక్కొక్కరికి ఒకరోజు కు) చొప్పున వండి వడ్డిస్తారు.

 

 పకడ్బందీగా అమలుచేస్తాం

 గర్భిణులు, చి న్నారులు, బా లింతల ఆర్యోగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఈ పథ కం ప్రవేశపెట్టనుంది. చాలామంది గర్భిణులు పౌష్టికాహారం లేక  రక్తహీనతతో బాధపడుతున్నారు. ఒ క్కోసారి మరణం కూడా సంభవి స్తుంది. వారందరికీ ఈ పథకం వ రంలా మారనుంది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రజల భాగస్వామ్యం తోనే కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. నెలాఖారు నాటికి ఈ ప్రక్రి య ముగియనుంది.

 - ఆనందం, ఇన్‌చార్జి సీడీపీఓ, వనపర్తి

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top