19న మానుకోటలో షర్మిల రోడ్ షో

19న మానుకోటలో షర్మిల రోడ్ షో

  •      ఎన్నికల ప్రచారానికి ఏర్పాట్లు పూర్తి

  •      వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి     డాక్టర్ తెల్లం వెంకట్రావు

  •  మహబూబాబాద్, న్యూస్‌లైన్ : మానుకోట పార్లమెంట్ స్థానం పరిధి లో వైఎస్సార్ సీపీ తరఫున ఎన్నికల ప్రచారం లో భాగంగా ఈనెల 19న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల రోడ్ షో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 19న ఉదయం 9.30 గంటలకు మరిపెడలో, 11.00 గంటలకు మహబూబాబాద్‌లో, 4.00 గంటలకు నర్సంపేటలో రోడ్ షో ఉంటుందని, పార్టీ కార్యకర్తలు, వైఎస్‌ఆర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవం తం చేయాలని కోరారు.

     

    తెలంగాణలోను వైఎస్సార్ సీపీ బలంగా ఉందని, ప్రతీ గ్రామంలోనూ దివంగత మహానే త వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు అధికం గా ఉన్నారని పేర్కొన్నారు. పార్టీకి ఉన్న ఓటు బ్యాంకుతో ఈ ఎన్నికలలో సత్తా చాటుతామని చెప్పారు. మానుకోట ఎంపీ స్థానంతోపాటు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామన్నారు. ఇక్కడ సీపీఎం, వైఎస్సార్ సీపీకి మంచి పట్టు ఉందని, సమన్వయంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజ లు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. ఖమ్మంలో జరిగిన షర్మిల రోడ్ షోకు అనూహ్య స్పందన లభించిందని, దీంతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చిందన్నారు.



    పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నట్లు వివరించారు. సమావేశంలో మాజీ ఓడీసీఎంఎస్ చైర్మన్, పార్టీ సీఈసీ మెంబర్ బీరం సంజీవరెడ్డి, పార్టీ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ లోకిని సంపత్, పార్టీ జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ బోళ్ల రాకేష్‌రెడ్డి, పార్టీ మానుకోట మండల కన్వీనర్ రాములు నాయక్, గూడురు మండల కన్వీనర్ మేకల రవీందర్ యాదవ్, బ్రాహ్మణపల్లి లక్ష్మీపురం సర్పంచ్ షఫీయొద్దీన్, రఫీ(లడ్డు), రమణ, గౌస్, పాపయ్య, సోమ నరేందర్‌రెడ్డి, బానోత్ దాము, తదితరులు పాల్గొన్నారు.

     

    అన్ని వర్గాల ప్రజలకు అనుకూలమైన పథకాలు

     

    నర్సంపేట : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అన్ని వర్గాల ప్రజలకు అనుకూలమైన పథకాలను ప్రవేశపెట్టి సువర్ణ పాలనను అం దించారు.. మళ్లీ ఆ పాలన వైఎస్ జగన్‌తోనే సాధ్యమని మానుకోట పార్లమెంట్ స్థానానికి పార్టీ నుంచి పోటీ చేస్తున్న, సీపీఎం బలపర్చిన తెల్లం వెంకట్రావు అన్నారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ నాడెం శాంతికుమార్ ఇంటి ఆవరణలో గురువారం రాత్రి జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.



    నర్సం పేట నియోజకవర్గంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.320 కోట్లు మం జూరు చేసి 45వేల ఎకరాలకు దేవాదుల నీటి మళ్లింపు పనులు చేపట్టాడని చెప్పారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ఎత్తివేసిందని అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్తినేని సోమేశ్వర్‌రా వు మాట్లాడుతూ వైఎస్ ఆశయ సాథన కోసం ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి పేదల పెన్నిదిగా పోరాటాల ద్వారా గుర్తింపు పొందాడని తెలిపారు.



    ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో నర్సంపేట, దుగ్గొండి, నెక్కొండ మండలాల పార్టీ అధ్యక్షులు నూనె నర్సయ్య, వలస రామ్మూర్తి, భూక్య లాలు, ఎస్‌కే.ఖాజాబీ, లింగ న్న, గిరగాని చంద్రమౌళి, కీసరి రాంబాబు, భరత్‌రెడ్డి, బూర సుదర్శన్, సుమన్, పూజారి వెంకటేశ్వర్లు, బానోతు రమేష్, మూడు శాంత, మండల ప్రకాశ్ పాల్గొన్నారు.

     

    వైఎస్ పథకాలను నీరుగార్చిన పాలకులు


     

    మరిపెడ : నిరుపేదల అభ్యున్నతి కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ పాలకులు నీరుకార్చారని వైఎస్సార్ సీపీ మహబూబాబా ద్ పార్లమెంట్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు ఆరోపించారు. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించి అవినీతి, అక్రమాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే తపనతో కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చిన హామీలను గుప్పిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్తినేని సోమేశ్వర్‌రావు, డోర్నకల్ ఎమ్మెల్యే అభ్యర్థి సుజాతమంగీలాల్, నాయకు లు బుచ్చిబాబు, ముదిరెడ్డి నరేష్‌రెడ్డి, వెంకన్న, లింగయ్య, బయ్యసాయి పాల్గొన్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top