పోలీసులపై తాగుబోతు దాడి
చాంద్రాయణగుట్ట: ఛత్రినాక చౌరస్తాలోని ఓ టీ స్టాల్ వద్ద గురువారం ఓ తాగుబోతు న్యూసెన్స్ చేస్తుండగా పక్కనే అవుట్ పోస్ట్‌లో ఉన్న పోలీసులు అతడి అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఇంకేముంది....తాగుబోతుకు చిర్రెత్తుకొచ్చింది. ఒక్కసారిగా పోలీసులపై దాడికి తెగబడ్డాడు. పోలీసులు అతడ్ని ఎంతో కష్టం మీద అవుట్ పోస్ట్ వద్దకు తీసుకెళ్లారు.
అంతలోనే అక్కడి చేరుకున్న తాగుబోతు కుమారుడు పోలీసులను దుర్భాషలాడాడు. పోలీసులు వెంటనే ఈ విషయాన్ని స్టేషన్‌కు సమాచారం అందించారు. బ్లూ కోట్స్ పోలీసులు అక్కడికి చేరుకొని లోపే తాగుబోతు, కుమారుడు కలిసి బైక్‌పై పరారయ్యారు. కాగా ఈ ఘటనలో ఓ పోలీసుకు ముఖంపై గాయాలయ్యాయి.
సంబంధిత వార్తలు