నమ్మి ఆశ్రయమిస్తే.. నడిరాత్రి దోచుకెళ్లింది

నమ్మి ఆశ్రయమిస్తే.. నడిరాత్రి దోచుకెళ్లింది


14 తులాల బంగారం,

90 తులాల వెండి ఆభరణాల అపహరణ


 

హసన్‌పర్తి : వృద్ధురాలు నమ్మి ఓ యువతికి తన ఇంట్లో ఆశ్రయమిస్తే.. అర్ధరాత్రి వేళ ఆ అగంతకురాలు సొత్తు దోచుకెళ్లింది. కొద్దిసేపు తలదాచుకుంటానని ఇంట్లోకి వచ్చి వృద్ధురాలికి సంబంధించిన సుమారు 14 తులాల బంగారం, 90 తులాల వెండి, రూ.12,500 నగదు ఎత్తుకెళ్లింది. ఈ సంఘటన మండల కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా హసన్‌పర్తికి చెందిన ఉప్పుల యాకమ్మ, ముత్తయ్య దంపతులు హసన్‌పర్తిలోని కేశవాపూర్ రోడ్డులో నివాసముంటున్నారు. వారిద్దరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం ఉదయం ఓ యువతి ఇద్దరు పిల్లలతో వారింటికి వచ్చి ఇల్లు అద్దెకు కావాలని అడిగింది. ఇల్లు ఖాళీ లేదని యూకమ్మ చెప్పడంతో ఆ యువతి వెళ్లిపోరుుంది. ఆ యువతి తిరిగి రాత్రి 8 గంటలకు మళ్లీ వారింటికి చేరుకుంది. అప్పడు మాత్రం ఆమెతో ఇద్దరు పిల్లలు లేరు. ఆమె తలుపు తట్టడంతో యాకమ్మ తలుపు తెరిచి ఎవరని ప్రశ్నించగా తనకు  అద్దెకు ఇల్లు దొరికిందని, సామాను కూడా రూమ్‌కు తీసుకొచ్చానని చెప్పింది.



అయితే తన భర్త వచ్చేవరకు ఆలస్యమవుతుందని, ఇక్కడికి వచ్చానని నమ్మిం చింది. తన భర్త వస్తే వెళ్లిపోతానని, లేదంటే పొద్దున్నే వెళ్తానని చెప్పడంతో ఆ వృద్ధురాలు సరేనంది. రాత్రి 11 గంటల వరకు మాట్లాడిన యూకమ్మ తన సంచిని తీసి పక్కన పెట్టి నిద్రించింది. అదే సమయంలో ఆ యువతి కూడా నిద్రపోతున్న ట్లు నటించింది. అర్ధరాత్రి 12.30 గంటలకు యూకమ్మకు మెలకువ వచ్చి చూడగా అక్కడ ఆ యువతి కనిపించలేదు. పక్కనే బంగారం, వెండి, డబ్బులు దాచ్చుకున్న డబ్బా తాళం తెరిచి ఉంది. దీంతో ఆందోళనకు గురైన యాకమ్మ డబ్బాను పరిశీలించగా బంగారం, వెండి, డబ్బులు కనిపించలేదు. ఒక్కసారిగా షాక్‌కు గురైన వృద్ధురాలు లబోదిబోమంటూ బోరున ఏడుస్తుండగా చుట్టుపక్కల వారు విని అక్కడికి చేరుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.  వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షిం చారు. బుధవారం ఉదయం ఎస్సై శ్రీనివాస్, ఏఎస్సై ఉపేందర్‌రావు సంఘటన స్థలాన్ని చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. వృద్ధురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. 15 రోజుల  క్రితం హసన్‌పర్తికి చెందిన ఓ విద్యార్థినికి సంబంధించిన బంగారు గొలుసును ఈ యువతే తస్కరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.



అద్దె ఇల్లు కోసం సంచరించిన యువతి



సదరు యువతి మూడు ప్రాంతాల్లో అద్దె ఇల్లు కావాలని తిరిగి నట్లు స్థానికులు చెబుతున్నారు. అదే ప్రాంతంలోని పావుశెట్టి సాంబయ్య ఇంటికి వచ్చి ఇల్లు అద్దెకు కావాలని అడిగినట్లు వారు తెలిపారు. అలాగే వీసం వాడకు వెళ్లి  అద్దె ఇల్లు కోసం వెతికినట్లు ఆ కాలనీవాసులు వివరించారు.  గాంధీనగర్‌లో కూడా ఆ యువతి సంచరించినట్లు చెప్పారు.

 

 



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top