బీ కేటగిరి విద్యార్థులకు స్కాలర్‌షిప్ రాదు


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ మైనారిటీయేతర, మైనారిటీ వృత్తి విద్యాసంస్థల్లో (2015-16లో) ‘బీ’కేటగిరిలో మెడికల్, డెంటల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు పొందేందుకు అనర్హులని ప్రభుత్వం తాజాగా స్పష్టంచేసింది. మేనే జ్‌మెంట్ కోటా లేదా స్పాట్ అడ్మిషన్ల ద్వారా (కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లను ఆ తర్వాత యాజమాన్యాలు భర్తీచేసేవి) చేరే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వబోమని పేర్కొంది.


 


మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరిలో ప్రవేశం  పొందిన ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్ పథకం వర్తిస్తుందని గతంలో ఇచ్చిన ఈ ఉత్తర్వులను సవరించారు. కన్వీనర్ కోటా కింద పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు పొందేందుకు అర్హులని సోమవారం ఎస్సీ అభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి జె.రేమండ్‌పీటర్ జీవో 14ను జారీచేశారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top