కొలిక్కిరాని భూ పంపిణీ గ్రామాల ఎంపిక


ముకరంపుర : ప్రభుత్వం చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమానికి లబ్ధి పొందాల్సిన గ్రామాల ఎంపిక ఇంకా కొలిక్కిరాలేదు. ఇప్పటివరకు ఈ ప్రక్రియపై ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి లో మార్గదర్శకాలు జారీ కాకపోవడం.. ఆగస్టు 15న భూపం పిణీ కార్యక్రమం చేపడతామని ప్రకటించడంతో అధికార యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. 40 శాతం ఎస్సీ జనాభా ఉన్న గ్రామాలను ఎంపిక చేయా లా..? భూములు ఉన్న గ్రామాలను ఎంపిక చేయాలా..? అని తర్జనభర్జన పడుతున్నారు. భూములున్న చోట దళితులు ఉండడం లేదు.



40 శాతం దళిత జనాభా ఉన్న చోట భూములు లేకపోవడంతో అధికారులు అయోమయానికి గురవుతున్నారు. దళిత కుటుంబాలను సర్వే చేయాలని ప్రభుత్వం డీఆర్‌డీఏను ఆదేశించడంతో గ్రామాల ఎంపిక పూర్తికానప్పటికీ.. షెడ్యూల్‌లో భాగంగా శుక్రవారం నగరంలోని స్వశక్తి కళాశాలలో జగిత్యాల, మంథని డివిజన్లకు చెందిన వీఆర్‌వో, పంచాయతీ కార్యదర్శులు, వీఎస్‌ఏ (విలేజ్ సోషల్ ఆడిటర్)కు ఒకరోజు శిక్షణ ఇచ్చారు.



 ఇప్పటివరకు ఎంపిక చేసిన గ్రామాలకు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఆమోదం తెలపలేదు. ఒకవేళ మార్పులుచేర్పులు ఉంటే అందుకనుగుణంగా సిద్ధంగా ఉం డేందుకు ఆయా గ్రామాల సిబ్బంది కి శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. శనివారం పెద్దపల్లి, సిరిసిల్ల, 28న కరీంనగర్ డివిజన్ల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top