అక్రమ బస్సు ఆపరేటర్లపై చర్యలేవీ?

అక్రమ బస్సు ఆపరేటర్లపై చర్యలేవీ? - Sakshi


సాక్షి, హైదరాబాద్‌: మోటారు వాహనాల చట్టం, మోటారు ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్ల చట్టం, ఏపీ మోటారు ట్రాన్స్‌పోర్టు వర్కర్ల నిబం ధనలకు విరుద్ధంగా బస్సులను నడుపుతున్న ప్రైవేటు బస్సు ఆపరేటర్లపై ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించిం ది. ముఖ్యంగా ఏపీ మోటారు ట్రాన్స్‌పోర్టు వర్కర్ల నిబంధనల ప్రకారం డ్రైవర్ల పని గంటల విషయంలో జరుగుతున్న ఉల్లంఘన లను అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకు న్నారోనివేదికలు ఇవ్వాలని ఉభయ రాష్ట్రాల రవాణా శాఖ ముఖ్య కార్యదర్శులు, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శులతోపాటు దివాకర్‌ ట్రావెల్స్‌కు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ను ఏప్రిల్‌ 18కి వాయిదా వేసింది.



ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌తో కూడిన ధర్మాసనం మంగళ వారం ఉత్తర్వులిచ్చింది. మోటారు వాహన చట్టాలకు విరుద్ధంగా ఉభయ రాష్ట్రాల్లో ప్రైవే టు బస్సు ఆపరేటర్లు  బస్సులు నడుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, దీనివల్లే గత నెల 28న కృష్ణాజిల్లా మూలపాడు గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిం దని, ఇందుకు చట్టాన్ని అమలు చేయని సం బంధిత శాఖ అధికారులను బాధ్యులను చేయాలని కోరుతూ న్యాయవాది కె.వి.సుబ్బా రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. దీనిపై మంగళవారం ధర్మాసనం విచారణ జరిపింది.  



పర్మిట్లు లేకపోయినా అనుమతులు...

చట్టబద్ధమైన పర్మిట్లు లేకపోయినప్పటికీ వేలాది బస్సులకు ఇరు రాష్ట్రాల అధికారులు అనుమతులిస్తున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పి.వి.ఎ.పద్మనాభం చెప్పారు. కాంట్రాక్ట్‌ క్యారేజీలుగా అనుమతులు తీసుకు ని స్టేజ్‌ కారేజీలుగా నడుపుతున్నారని, తద్వా రా ఆర్టీసీకి కోట్ల రూపాయల నష్టం కలుగు తోందని, అయినా అధికారులు పట్టించు కోవడం లేదని తెలిపారు. కేంద్ర మోటారు వాహన చట్టంలో సవరణలు తీసుకొచ్చి, ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు డ్రైవర్ల పని గంటల్లో మార్పులు తీసుకొచ్చింద న్నారు. దీని ప్రకారం డ్యూటీకి మధ్య 8 గంటల విరామం ఉండాలని, వారంలో 72 గంటలకు మించి డ్రైవర్లు పని చేయడానికి వీల్లేదన్నారు.



 కానీ కొన్ని రూట్లలో డ్రైవర్లు ఏకబిగిన 26 గంటల పాటు పనిచేస్తు న్నార న్నారు. దీంతో అనేక ఘోర ప్రమా దాలు జరుగుతున్నాయని తెలిపారు. స్పందించిన ధర్మాసనం... డ్రైవర్ల పని గంటల విషయంలో  ఉల్లంఘనలకు పాల్పడుతున్న ప్రైవేటు బస్సు ఆపరేటర్లపై ఏం చర్యలు తీసుకున్నారో వివరి స్తూ నివేదికలు ఇవ్వాలని ఉభయ రాష్ట్రాల రవాణా, కార్మికశాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. మూలపాడు దుర్ఘటనకు కార ణమైన దివాకర్‌ ట్రావెల్స్‌కు కూడా నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంట ర్లు దాఖలు చేయాలని సూచించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top