అప్పుడు తెలంగాణకు అన్యాయం

అప్పుడు తెలంగాణకు అన్యాయం


- సీఎం కేసీఆర్ చొరవతో ఈసారి ప్రాధాన్యం

- పెద్దపల్లి-నిజామాబాద్ రూట్‌కు భారీ నిధులు

- కొత్త లైన్లకు ఆమోదం తెలిపితే  బాగుండేది

- బడ్జెట్‌పై ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందన


 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ‘‘ఉమ్మడి రాష్ర్టంలో అనేక ఏళ్లుగా తెలంగాణకు అన్యాయం జరుగుతూ వచ్చింది.తెలంగాణ సాధన అనంతరం తొలి రైల్వే బడ్టెట్ ఇది.



 సహచర ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి చొరవతో ఈసారి జరిగిన కేటాయింపులలో తెలంగాణ వాటా దక్కిందని భావిస్తున్నా. పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ లై నుకు రూ.141 కోట్లు ఇవ్వ డం సంతోషకరం’’ అని పేర్కొన్నారు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. ‘‘గత బడ్జెట్లో రూ.35 కోట్లే కేటాయించడంతో పోలిస్తే ఇది హర్షించదగ్గదే.



ఐతే ప్రజలు అ డుగుతున్నటువంటి మనోహరాబాద్-నిజామాబాద్ డబుల్ లైన్ పనులు, కొత్తలైన్లకు ఆమోదం తెలిపి కేటాయింపులు చేస్తే బాగుండేది. తె లంగాణకు ప్రత్యేకించి నిజామాబాద్ జిల్లాకు అవసరమైన ప్రాజెక్టుల కోసం నా ప్రయత్నం ఇక ముందు కూడా కొనసాగుతూ ఉంటుంది. తెలంగాణకు 14 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు కూడా కేటాయించడం హర్షించదగ్గ విషయం. మెదక్ జిల్లా మాసాయిపేటలో జరిగిన దుర్ఘటనను దృష్టిలో ఉంచుకుని కాపలా లేని గేట్ల విషయంలో చర్యలు తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాను. ముఖ్యంగా మహిళల భద్రతకు సంబంధించి తీసుకోబోతున్న చర్యలు బాగానే ఉన్నాయి.



స్టేషన్లలో సౌకర్యాలు, టాయిలెట్ల నిర్వహణ మెరుగుపర్చడం మంచి పరిణామం కాగా, రైల్వేలలో రాష్ట్రాలు పెట్టుబడులు పెట్టాలనడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. రైల్వేలు ఉమ్మడి జాబితాలోని అంశం కాదు. అది కేంద్రం పరిధిలోని అంశం. నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయం కేంద్రం మాత్రమే తీసుకుంటుంది. కాబట్టి ఈ ప్రతిపాదన సమంజసం కాదు. దేశానికి రైల్వేలు రక్తనాడుల వంటివి. దేశాభివృద్ధికి, వివిధ ప్రాంతాల సంతులిత అభివృద్ధిలో రైల్వేల పాత్ర కీలకం కాబట్టి ఆ బాధ్యతను కేంద్రమే తీసుకోవాలి.



ఇది బడ్జెట్లో కేటాయింపులు మాత్రమేనని, అసవరమైతే ప్రత్యేక పరిస్థితులలో, సప్లిమెంటరి బడ్జెట్‌లో మరిన్ని కేటాయింపులకు అవకాశం ఉం దని రైల్వే మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. అందుకోసం కూడా ఎంపీగా మన ప్రయత్నాలు కొనసాగుతాయి’’ అని వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top