తలుపులు బార్లా..!

తలుపులు బార్లా..!


30 వేల జనాభాకో కొత్త బారు

పాత విధానాలకు స్వస్తి చెప్పిన ఆబ్కారీ శాఖ

దుకాణాల ప్రకారం కాకుండా జనాభా ప్రాతిపదికన..

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

 

 నల్లగొండ : కొత్త బార్లు అనుమతికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాత విధానాలకు స్వస్తి చెప్పి బార్ల పాలసీలో మార్పులు చేసింది. నూతన పాలసీ ప్రకారం.. జిల్లాలో కొత్తగా 8 బార్లు ఏర్పాటు చేసుకునే అవకాశం వ్యాపారులకు లభించింది. గతంలో పట్టణాల్లో మద్యం దుకాణాలను అంచనా వేసి బార్లు అనుమతి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో పట్టణాల్లో బార్ల సంఖ్య చాలా పరిమితంగా ఉంది. మద్యం దుకాణాలకు పోటీగా బార్లు అనుమతివ్వడం ద్వారా ఆ ప్రభావం దుకాణాలఅమ్మకాలపై పడే అవకాశం ఉంటుంది కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకుని కొత్త బార్లుకు అనుమతి ఇచ్చేవారు కాదు.



కానీ ప్రస్తుతం పాత పాలసీ రద్దు చేసి జనాభా ప్రాతిపదికన బార్లు ఏర్పాటు చేసుకోవచ్చుని అనుమతి ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 30 వేల జనాభా దాటిన ప్రాంతాల్లో కొత్తగా బార్లు ఏర్పాటు చేయాలని పేర్కొంది.   జిల్లాలో కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీ కోదాడలో, నగర పంచాయతీలు హుజూర్‌నగర్, దేవరకొండలలో బార్లు బార్లాగా తలుపులు తెరుచుకోనున్నాయి.



 పెరగనున్న బార్లు...

 జిల్లాలో ప్రస్తుతం బార్లు 21 ఉన్నాయి. మిర్యాలగూడ ఈఎస్ పరిధిలో 7, నల్లగొండ ఈఎస్ పరిధిలో 14 బార్లు ఉన్నాయి. మిర్యాలగూడ పరిధిలో కోదాడ మున్సిపాలిటీలో రెండు బార్లు, హుజూర్‌నగర్, దేవరకొండలో ఒక్కో బారు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ఇక నల్లగొండ ఈఎస్ పరిధిలో భువ నగిరి, సూర్యాపేటలో ఇప్పటికే జనాభాకు మించి బార్లు ఉండడంతో కొత్త బార్లకు అవకాశం లేదు. కానీ నల్లగొండ మున్సిపాలిటీలో జనాభా 1.65 లక్షలు ఉన్నందున ఇక్కడ కొత్తగా మూడు బార్లు రానున్నాయి. దీంతో పట్టణంలో బార్లు సంఖ్య ఐదుకు చేరనుంది. జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే మొత్తం బార్లు సంఖ్య 29కి చేరనుంది.



 నిబంధనలు ఇవీ..

 కొత్తగా బార్లు ఏర్పాటు చేయాలనుకునే వారి కి ఇప్పటికే రెస్టారెంట్ నిర్వహిస్తూ ఉండాలి. ట్రేడ్ లెసైన్స్‌తో పాటుగా వరుసగా రెండేళ్ల పాటు వ్యాట్ చెల్లించినట్లు ఆధారాలు ఉండా లి. ఏడాది కాలపరిమితితో బార్లు అనుమతి ఇస్తారు. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వ చ్చిన ట్లయితే డ్రా విధానం ద్వారానే లెసైన్స్ లు జారీ చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.5వేలు. నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో లెసై న్స్‌ఫీజు రూ.28లక్షలు నిర్ణయించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top