నల్లగొండలో మృత్యు‘దారి’!


  • ఒకే ప్రాంతంలో, ఒకేరోజు ఉదయం అక్క, సాయంత్రం తమ్ముడు మృతి

  • మునగాల: నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆదివారం తెల్లవారుజామున సోదరి మృతి చెందగా.. ఆమె అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా తమ్ముడూ అదే ప్రాంతంలో ప్రమాదంలో చనిపోయాడు. వివరాలు.. మునగాల మండలం ముకుందాపురం దళితవాడలో నివాసముంటున్న తాళ్లపాక పుల్లమ్మ(65) తెల్లవారుజామున హైవే దాటుతుండగా విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది.   



    పుల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కోదాడ మండలం కొమరబండకు చెందిన నెమ్మాది బంగారయ్య(60) మృతురాలు పుల్లమ్మకు సోదరుడు.  ముకుందాపురంలో ఆమె అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి స్వగ్రామం వెళ్లేందుకు జాతీయ రహదారి దాటుతున్నాడు. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే కారు ఉదయం ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే ఢీకొట్టి వెళ్లిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బంగారయ్య కూడా అక్కడికక్కడే మృతిచెందాడు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top