తెలంగాణ అభివృద్ధి కోసం ఎంపీ పొంగులేటి విజ్ఞప్తి

పొంగులేటి శ్రీనివాసరెడ్డి - Sakshi


ఖమ్మం: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వైఎస్‌ఆర్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర అభివృద్ధికి పలు విజ్ఞప్తులు చేశారు. భద్రాచలంలో గోదావరి రెండవ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రిని పొంగులేటి కలిశారు. సత్తుపల్లి-కొత్తగూడెం మధ్య నాలుగు లైన్ల రోడ్లు నిర్మించాలని కోరారు. సూర్యాపేట-దేవరపల్లి నాలుగు లైన్ల రోడ్డుని జాతీయ రహదారిగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. భద్రాచలంలో గిరిజన విశ్వవిద్యాలయం, కొత్తగూడెంలో మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని శ్రీనివాస రెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు.



ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ  ఒడిశా ద్వారా తెలంగాణకు సీపోర్టు నిర్మాణం చేయడానికి మంత్రి గడ్కరీ అంగీకరించినట్లు  చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top