హౌసింగ్ అక్రమాలపై సభాసంఘం: ఎమ్మెల్సీలు


సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్, ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీల్లో ప్లాట్ల కేటాయింపులో జరిగిన అవకతవకలపై నిజానిజాలు నిగ్గుదేల్చేందుకు ఎమ్మెల్సీలతో సభాసంఘం వేయాలని, లేదా సీబీఐతో దర్యాప్తు జరిపించాలని సోమవారం శాసమండలిలో పలువురు సభ్యులు డిమాండ్ చేశారు.



ప్రముఖుల హౌజింగ్‌సొసైటీల్లో భారీ అవకతవకలు జరిగినట్టు 40కి పైగా ఆరోపణలు వచ్చాయని, వాటిని వెలుగులోకి తెస్తే ప్రభుత్వానికి అదనంగా ఆదాయం సమకూరుతుందని పొంగులేటి సుధాకర్‌రెడ్డి (కాంగ్రెస్) అన్నారు. అధికార పార్టీ సభ్యులూ దాన్ని బలపరచడంతో, సభాసంఘం ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి సమావేశాలు ముగిసేలోగా నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ స్వామిగౌడ్ హామీ ఇచ్చారు.



పర్యాటక ప్రాంతంగా రాచకొండ...

నల్లగొండ జిల్లా రాచకొండ గుట్ట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.8.74 కోట్ల అంచనాలతో సమగ్ర ప్రతిపాదనలను కేంద్రపర్యాటక శాఖకు నివేదించినట్టు ఉపముఖ్యమంత్రి రాజయ్య సభలో తెలిపారు. నల్లగొండ, మెదక్ జిల్లాల పరిధిలో కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమల కట్టడిలో కాలుష్యనియంత్రణ మండలి అధికారులు దారుణంగా విఫలమౌతున్నారనికర్నె ప్రభాకర్, రాములునాయక్ (టీఆర్‌ఎస్) అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top