తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు - Sakshi


మహబూబ్‌నగర్‌: వేసవి సీజన్‌లో పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ పట్టణ ప్రజలకు భరోసా కల్పించారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌ రాధాఅమర్‌తో కలిసి పట్టణంలోని వెంకటేశ్వర్‌ కాలనీలో ఆయన ఆకస్మిక తనిఖీ చేపట్టారు. పట్టణంలో తాగునీటి సరఫరా విధానంపై ఆయన ఆకస్మిక తనిఖీ చేసి అధికారులకు తగు సూచనలు చేశారు. పట్టణంలో గతంలో 15 రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేసిన దాఖాలాలు లేవని, తాము అ ధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే తాగునీటి ఎద్దడిని పూర్తిగా నివారించగలిగామని అన్నా రు. పట్టణంలో డేబైడే నీటిని పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తాగునీటి పంపిణీపై కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. త్వరలో మిషన్‌భగీరథ పథకం పనులను పూర్తి చేసి పట్టణంలో నిత్యం తాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.



పైపులైన్‌కు నిధులు

పట్టణంలో  రూ.167కోట్లతో పైపులైను పనులను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ పూర్తి అయిందని, త్వరలోనే పనులను ప్రారంభిస్తామన్నారు. పట్టణంలో రూ. 40కోట్లతో రోడ్లు, డ్రైనేజీల పనులను చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రెండు నెలల్లో పట్టణంలో ఎల్‌ఈడీ స్ట్రీట్‌లైట్లను ఏర్పాటు చేసి పట్టణాన్ని సుందరమయంగా చేస్తామన్నారు. ఇకపై పట్టణంలోని వార్డులలో ఆకస్మికంగా తనిఖీలు నీటి సరఫరాపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా  మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది ప్రణాళికబద్దంగా పనిచేయాలని ఆయన సూ చించారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌ రాధాఅమర్, కౌన్సిలర్‌ గంజి అంజనేయులు, మున్సిపల్‌ డీఈలు బెంజ్‌మెన్, మధు, సానిటరీ ఇన్సిపెక్టర్లు శ్రీమన్‌నారాయణ, వజ్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top