నిర్ణయం మంచిదే!


పార్టీ మారాలనే నిర్ణయంపై అభిప్రాయ సేకరణ

సన్నిహితులతో పొద్దుపోయేవరకు చర్చలు

వ్యతిరేకించిన సీనియర్లు.. వెళ్దామన్న ప్రజాప్రతినిధులు

ఒప్పించిన మంచిరెడ్డి

నేరుగా తుమ్మలతో భేటీ.. నేడో, రేపో సీఎంను కలిసే ఛాన్స్

ప్లీనరీ తర్వాతే గులాబీ తీర్థం పుచ్చుకునే అవకాశం?


 

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గులాబీ గూటికి చేరడం దాదాపుగా ఖాయమైంది. పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా.. కారెక్కేందుకే ఆయన మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులోని తన వ్యవసాయక్షేత్రంలో పార్టీ ముఖ్యనేతలు, సహచరులతో సుదీర్ఘ మంతనాలు సాగించిన మంచిరెడ్డి... టీఆర్‌ఎస్‌లో చేరేందుకు దారితీస్తున్న పరిణామాలను వివరించారు. గత రెండు పర్యాయాలు విపక్షంలోనే ఉండడంతో నియోజకవర్గ అభివృద్ధికి ఆశించిన స్థాయిలో నిధులు రాబట్టలేకపోయానని, ఇప్పుడు అధికారపార్టీతో చేతులు కలిపితే మంచి భవిష్యత్తు ఉంటుందని హితబోధ చేశారు.



అయితే, ఎమ్మెల్యే అభిప్రాయాలను పలువురు సీనియర్లు విభేదించారు. ఇప్పటికే గ్రూపు రాజకీయాలతో కీచులాడుకుంటున్న టీఆర్‌ఎస్‌లో చేరడం రాజకీయంగా మంచిది కాదని వారించారు. సంస్థాగతంగా నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉందని, ఈ పరిస్థితుల్లో గులాబీ తీర్థం పుచ్చుకొని కొత్త సమస్యలు కొనితెచ్చుకోవడం ఎందుకని ప్రశ్నించారు. తమ గ్రామాల్లో ప్రత్యర్థులుగా ఉన్న టీఆర్‌ఎస్ నేతలతో ఎలా కలిసి సాగుతామని యాచారం మండల కార్యకర్తలదే తుది నిర్ణయం రెండు, మూడు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై పార్టీ ముఖ్యులతో చర్చించా. పార్టీలోనే కొనసాగాలా? టీఆర్‌ఎస్‌లో చేరాలా? అనే అంశంపై నాయకుల మనోగతాలను తెలుసుకున్నాను. అత్యధికులు పార్టీ మారాలనే అభిప్రాయమే వ్యక్తపరిచారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోను. కార్యకర్తల అభిమతం మేరకే నడుచుకుంటా.    - మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

 



నాయకులు ప్రశ్నలవర్షం కురిపించారు.  సమావేశంలో భిన్నస్వరాలు వినిపించడంతో మండలాలవారీగా నేతలతో విడివిడిగా భేటీ అయి ఒప్పించారు. రాజకీ యంగా ఉజ్వల భవిష్యత్తు ఉండాలంటే అధికారపార్టీ అండదండలు ముఖ్యమని, గతకొన్ని నెలలుగా ఈ సమీకరణలన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాతే పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు వివరించినట్లు సమాచారం.



తుమ్మల రాయబారం!

ఎలిమినేడులో పొద్దుపోయేవరకు తెలుగుతమ్ముళ్లతో సమాలోచనలు జరిపిన మంచిరెడ్డి.. అక్కడి నుంచి నేరుగా ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. సమావేశ సారాంశాన్ని వివరించిన అనంత రం..  ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో సీఎంతో కిషన్‌రెడ్డి భేటీ కానున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఈనెల 23న కారెక్కేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నా.. ప్లీనరీ తర్వాతే పార్టీలో చేరడం మంచిదని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది.



లోకేష్ చివరి ప్రయత్నం!

జిల్లా పార్టీ సారథిగా వ్యవహరిస్తున్న కిషన్‌రెడ్డి పార్టీ మారుతున్నట్లు సంకేతాలు రావడంతో టీడీపీ యువనేత లోకేష్ రంగప్రవేశం చేశారు. మంచిరెడ్డి కుమారుడు, మాజీ కార్పొరేటర్ ప్రశాంత్‌కుమార్‌రెడ్డిని పిలిపించిన లోకేశ్.. అన్ని విధాలా ఆదుకుంటామని, కేంద్రంలో నామినేటెడ్ పదవి కట్టబెడతామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.



మొదట్నుంచి పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు సన్నిహితుడిగా ఉన్న కిషన్‌రెడ్డిని పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్లు తెలియడంతో పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్.రమణ కూడా నష్టనివారణ చర్యలకు దిగారు. ప్రశాంత్‌తో చర్చించి.. నాన్న పార్టీ మారకుండా చూడాలని హితబోధ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top