మిషన్ మోడ్..!

మిషన్ మోడ్..! - Sakshi


 బోరుబావిలో పడి మృతిచెందిన రెండేళ్ల చిన్నారి శాన్వి ఘటనతో జిల్లా యంత్రాంగం మేల్కొంది. శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో చోటు చేసుకున్న సంఘటనపై కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం సంభవించో...వైద్య సహాయం అందకపోతేనో లేదా ఏదైన జబ్బు సోకి మృతిచెందిన సంఘటన వంటది కాదని...కేవలం మానవ నిర్లక్ష్యం కారణంగానే శాన్వి మృతిచెందిందన్నారు. మృతి చెందిన శాన్విని తిరిగి తీసుకరాలేకపోయినా మరోసారి ఇలాంటి దురదృష్ట ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వాల్టా చట్టాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.



మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  జిల్లాలో నిరుపయోగంగా ఉన్న బోరుబావుల గురించి ‘మిషన్‌మోడ్’లో చర్యలు చేపట్టేందుకు రూపొందించిన కార్యచరణ ప్రణాళిక గురించి వివరించారు.

 మిషన్ మోడ్ షురూ...జిల్లాలో నిరుపయోగంగా ఉన్న బోరుబావుల గురించి ఇప్పటికే ఓ నివేదిక తెప్పించామన్నారు. కానీ అట్టి వివరాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. వల్లాల ఘటన నేపథ్యంలో మళ్లీ జిల్లా వ్యాప్తంగా బోరుబావుల గురించి సమగ్ర సర్వే చేసేందుకు ‘మిషన్ మోడ్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు.



దీంట్లో వీఆర్వో, వీఆర్‌ఏ, జనమైత్రి పోలీస్, గ్రామజ్యోతి కమిటీలు భాగస్వాములను చేస్తూ అన్ని గ్రామాలు, ఆవాసా ప్రాంతాల నుంచి బోరుబావుల లెక్కలు తెప్పిస్తామన్నారు. నిరుపయోగంగా ఉన్న , అనుమతి లేకుండా వేసిన బోరుబావులను తక్షణమే మూసివేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. వల్లాల ఘటనపై రాష్ట్ర మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి సైతం తీవ్రంగా పరిగణించారని...ప్రభుత్వం ఆదేశాల మేరకు వాల్టా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.

 అంచనాలు తారుమారు....



 శాన్వి బోరుబావిలో పడిందన్న వార్త తెలియగానే జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి చిన్నారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టిందన్నారు. అధికారుల నుంచి వచ్చిన సమాచారం మేరకు సోమవారం రాత్రి 8.48 నిమిషాల వరకు పాపను బోరుబావి నుంచి సురక్షితంగానే బయటకు తీసుకొస్తామని తనకు చెప్పారన్నారు. కానీ అధికారుల అంచనాలు తారుమరై పాపను కాపాడేందుకు తవ్వుతున్న ప్రదేశంలో రాక్‌షీట్ (బండరాయి) తగలడంతో పాటు, మట్టిపెల్లలు జారీ పడటంతో చేపట్టిన చర్యలు విఫలమయ్యాయన్నారు. రాత్రి 11 గంటలకు అహర్నిశలు శ్రమించినా శాన్విని కాపాపడలేకపోయామని చెప్పారు. అనుమతి ఉంటేనే...



 బోరుబావులు తవ్వేందుకు అధికారుల నుంచి అనుమతి తీసుకున్నప్పుడు మాత్రమే ఏదైన ఘటన జరిగినప్పుడు వారిని బాధ్యుల్లి చేయకలుగుతామన్నారు. అధికారుల అనుమతి లేకుండా తవ్వుతున్న బోరుబావుల విషయంలో భూ యజమానులపై మాత్రమే కేసులు నమోదు చేస్తామన్నారు. దీనికి సంబంధించి బోరు డ్రిల్లింగ్ అసోసియేషన్లు, వ్యక్తిగత బోరు వాహనాలు కలిగిన వారికి నోటీసులు జారీ చేస్తామన్నారు. అధికారుల నుంచి అనుమతి పొందిన బోరుబావులకు మాత్రమే రిగ్గు యజ మానులు బోర్లు తవ్వాలని అలాకాకుండా తమ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.  సమావేశంలో ఏజే సీ వెంకట్రావు, డీఆర్వో రవినాయక్, జెడ్పీ సీఈ వో రావుల మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top