‘మిషన్ కాకతీయ’లో రూ. 4.42 కోట్లు మంజూరు


ప్రభుత్వ విప్ గంప గోవర్దన్

కామారెడ్డి : మిషన్ కాకతీయ కింద కామారెడ్డి నియోజకవర్గంలో 25 చెరువుల మరమ్మతుకు రూ.4.42 కోట్లు మంజూరైనట్లు ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ తెలిపారు. గురువారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భిక్కనూరు మండలంలో నాలుగు చెరువులకు రూ. 44.57 లక్షలు, దోమకొండలో ఏడు చెరువులకు రూ. 1.1 కోట్లు, కామారెడ్డి మండలంలో ఒక చెరువుకు రూ. 43.30 లక్షలు, మాచారెడ్డి మండలంలో 13 చెరువులకు రూ 2కోట్ల 53 లక్షల 82 వేలు మంజూరయ్యూయని వివరించారు.



భిక్కనూరు మండలం ఇస్సన్నపల్లిలోని ఇసన్నచెరువుకు రూ.11.20 లక్షలు, కాచాపూర్‌లోని పటేల్‌కుంటకు రూ. 10.80 లక్షలు, రాజంపేటలోని పటేల్‌కుంటకు రూ. 11.57 లక్షలు, ఆరెపల్లిలోని తురుకవానికుంటకు రూ. 11 లక్షలు, దోమకొండ మండలం అంచనూర్‌లోని పెద్దచెరువుకు రూ.15.40 లక్షలు, చింతామనిపల్లిలోని ఊరచెరువుకు రూ. 18.20 లక్షలు, ఉప్పర్‌పల్లిలోని చింతలకుంటకు రూ. 14.80 లక్షలు, జనగామలోని బదలవానికుంటకు రూ. 13.30 లక్షలు, ఇస్సానగర్‌లోని పటేల్‌కుంటకు రూ. 11.50 లక్షలు, దోమకొండలోని బయ్యన్నకుంటకు రూ. 16.15 లక్షలు, కామారె డ్డి మండలం తిమ్మక్‌పల్లి పెద్దచెరువుకు రూ. 43.30 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. మాచారెడ్డి మండలంలోని దేవునిపల్లిలో పులిచెరుకుంటకు



రూ. 11.35 లక్షలు, ఇస్సాయిపేటలోని మల్లుకుంటకు రూ. 9.10 లక్షలు, ఎల్పుగొండలోని తురుకవానికుంటలకు రూ. 12.20 లక్షలు, గన్‌పూర్(ఎం) లోని ఊరచెరువుకు రూ. 13.85 లక్షలు, సింగరాయపల్లిలోని సామగంజికుంటకు రూ. 10.45 లక్షలు, భవానీపేటలోని చందాచెరువుకు రూ. 11.50 లక్షలు, బీఆర్‌పల్లిలోని కావేరికుంటకు రూ. 16.40 లక్షలు, రెడ్డిపేటలోని దామెరచెరువుకు రూ. 36.10 లక్షలు, అన్నారంలోని బసిరెడ్డికుంటకు రూ. 10.70 లక్షలు, మద్దికుంటలోని గుడికుంటకు



రూ. 10.45 లక్షలు, ఎల్లంపేటలోని వెంకటాద్రి చెరువుకు రూ. 59.60 లక్షలు, సోమారంపేటలోని తాళ్లచెరువుకు రూ. 17.35 లక్షలు, లచ్చాపేటలోని లచ్చిచెరువుకు రూ. 34.77 లక్షలు మంజూరైనట్టు వివరించారు. ఈ నిధులతో చేపట్టే పనులలో ఎలాంటి అవినీతి జరిగినా కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని గోవర్దన్ హెచ్చరించారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దిన్, టీఆర్‌ఎస్ నేతలు వేణుగోపాల్‌రావ్, మధుసూధన్‌రావ్, లక్ష్మారెడ్డి, ఆంజనేయులు, మోహన్‌రెడ్డి, శేఖర్, బల్వంత్‌రావ్ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top