డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టండి

డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టండి - Sakshi


- ‘డబుల్‌’ లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్‌ పిలుపు

- సీఎం.. ఆడపడుచులకు మేనమామ.. రైతులకు పెద్దన్న

- 60 ఏళ్ల గబ్బును పారదోలడానికి మూడేళ్లు సరిపోదు

- బంగారు తెలంగాణగా మార్చే జిమ్మేదారీ కేసీఆర్‌దేనని ఉద్ఘాటన




సాక్షి, మహబూబ్‌నగర్‌/వనపర్తి/నాగర్‌ కర్నూల్‌: రాష్ట్రంలో పేదల కోసం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పేదల ఆత్మ గౌరవానికి ప్రతీక అని, లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టాలని ప్రజలకు మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె. తారక రామారావు పిలుపు నిచ్చారు. మంగళవారం ఆయన మహ బూబ్‌ నగర్‌ జిల్లా దివిటిపల్లిలో, నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో,  వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మిరాసిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మాట్లా డారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇప్పిస్తామని వచ్చే బ్రోకర్లను నమ్మవద్దన్నారు.  రూ.18 వేల కోట్లతో 2.65 లక్షల ఇళ్లను నిర్మిస్తు న్నామని, దేశంలో ఇంత పెద్ద ప్రాజెక్టును చేప ట్టిన దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్క రేనని పేర్కొన్నారు.



ఇళ్లు, భూమితో కలుపు కొని ఒక్క లబ్ధిదా రునికి రూ.20 లక్ష వరకు ఖర్చు అవుతుం దన్నారు. ఎలాంటి బ్యాంకు రుణాలు లేకుండా పూర్తిగా ప్రభుత్వ ఖర్చు తోనే నిర్మి స్తున్నట్లు కేటీఆర్‌ వివరించారు. ప్రతి పేద వాడికి భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఇంత పెద్ద ప్రాజె క్టుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తెలంగాణ వస్తే ఏం వస్తదని కొంతమంది అవహేళన చేసిన వారికి ఈ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను చూపించాలని సూచించారు. డబుల్‌పై ప్రతి పక్ష పార్టీలు అన వసరంగా బురద చల్లుతున్నాయని ఆరోపిం చారు. 60 ఏళ్ల గబ్బును పారదోలడానికి మూడేళ్లు సరిపోదనన్నారు. రూ.51 వేలు ఉన్న షాదీముబారక్, కల్యాణ లక్ష్మి పథకాన్ని విలువను రూ.75 వేలకు పెంచామన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అవసరాలు తెలిసిన నేతగా సీఎం కేసీఆర్‌ ఆడపడుచులకు మేన మామగా, రైతులకు పెద్ద న్నగా అవసరాలు ఎరిగి పనులు చేస్తున్నారని అన్నారు.



కాంగ్రెస్‌ పాలనలో ఒక్క రోడ్డునూ మం జూరు చేయించుకోలేకపోయా: జూపల్లి

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో  తన నియోజకవర్గంలో ఒక్క రోడ్డును కూడా మంజూరు చేయించుకోలేకపోయాయని, ఆంధ్రా మంత్రులతోపాటు తెలంగాణకు చెందిన అప్పటి మంత్రి జానారెడ్డి కూడా సమస్యలను గాలికి వదిలారని గ్రామీణా భివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజక వర్గంలోని ఒక రోడ్డు విషయంలో జానారెడ్డి వద్దకు వెళ్లి రోడ్డును మంజూరు చేయాలని ప్రాథేయపడినా ఆయన కనికరించలేదని విమర్శించారు.  మరోమంత్రి వద్దకు వెళ్తే తన తమ్మున్ని కలసి రావాలని సూచిం చడం ఆవేదన కలిగించిందని జూపల్లి గుర్తు చేసు కున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప డ్డాక ఆ పరిస్థితులు మారాయని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలులో దేశంలోనే మొదటి స్థానం సంపాదించినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. కార్యక్రమం లో మహబూబ్‌నగర్‌ ఎంపీ ఏపీ జితేం దర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.  



కాంగ్రెస్‌ను దేశం నుంచి తరిమేయాలి

దేశంలోని అన్ని సమస్యలకు కాంగ్రెస్‌ పార్టీ మూలం అని, ఆ పార్టీని దేశం నుంచి తరిమికొట్టాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. పాలమూరు – రంగా రెడ్డి ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలోని కరువు రూపుమార్చితే తమకు భవిష్యత్‌ ఉండదన్న కారణంగానే కాంగ్రెస్‌.. ఈ ప్రాజెక్టు విషయంలో న్యాయపరమైన చిక్కులను సృష్టిస్తుందని మండిపడ్డారు. తెలంగాణను అభివృద్ధి చేసే పార్టీ కేవలం టీఆర్‌ఎస్‌యేనని, బంగారు తెలంగాణగా మార్చే జిమ్మేదారీ కూడా సీఎం కేసీఆర్‌దేనని  కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందిం చడం టీఆర్‌ఎస్‌కే సాధ్యమని అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top