మంత్రి హరీష్‌రావు పర్యటనకు తరలిరావాలి

మంత్రి హరీష్‌రావు పర్యటనకు తరలిరావాలి


పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు 

మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్న రాజవర్దన్‌రెడ్డి


 

మహబూబాబాద్ : రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖామంత్రి హరీష్‌రావు తొలిసారిగా గురువారం మానుకోటకు వస్తున్నారని, ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తెలిపారు. స్థానిక టీఆర్‌ఎస్  పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ మానుకోట మండలంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మంత్రి చేస్తారని తెలిపారు. మంత్రి హరీష్‌రావుతోపాటు గిరిజన, ప ర్యాటక శాఖ మంత్రి చందూలాల్, పార్లమెంటరీ కార్యదర్శి వినయ్‌భాస్కర్, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నాయకులు వస్తున్నారని చెప్పారు.

 

మైసమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా మారుస్తాం : ఎమ్మెల్యే



అనంతారంలోని అనంతాద్రి దేవాలయం పక్కన ఉన్న మైసమ్మ చెరువును 4.98 కోట్ల వ్యయంతో పర్యాటక కేంద్రంగా, మి నీట్యాంక్ బండ్‌గా మార్చేందుకు ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తెలిపారు. ఆ చెరువును మంత్రి సందర్శించడంతోపాటు ఆ చెరువు విషయాన్ని మంత్రికి వివరించినట్లు వెల్లడించారు. నాయకులు మార్నేని వెంకన్న, భీరవెల్లి భరత్‌కుమార్ రెడ్డి, పాల్వాయి రాంమ్మోహన్‌రెడ్డి, డోలి లింగుబాబు, కన్న, జెర్రిపోతుల వెంకన్న, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు, వెన్నం శ్రీకాంత్ రెడ్డి, మాచర్ల ఉప్పలయ్య, పొనుగోటి రామకృష్ణారావు, తూము వెంకన్న, గోగుల మల్లయ్య పాల్గొన్నారు.

 

మంత్రి పర్యటన మ్యాప్ రూట్ వివరాలు..



గురువారం మధ్యాహ్నం 2 గంటలకు నెల్లికుదురు నుంచి 200 బైక్‌లతో ర్యాలీగా మానుకోటకు చేరుకుంటారు. ఏరియా ఆస్పత్రికి వెళ్లి అక్కడి నుంచి అనంతాద్రి దేవాలయం, మైసమ్మ చెరువు సందర్శిస్తారు. సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన, మానుకోటలో పలు అభివృద్ది పనులు, రెడ్యాల లో ప్రభుత్వ హాస్టల్ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.  యశోదా గార్డెన్‌లో పీసీసీ కార్యదర్శి రాజవర్దన్‌రెడ్డితోపాటు పలు పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరే సభలో పాల్గొని తిరిగి వెళతారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top