మల్లన్నసాగర్‌కు కాంగ్రెస్సే అడ్డు

మల్లన్నసాగర్‌కు కాంగ్రెస్సే అడ్డు - Sakshi


శరవేగంగా ప్రాజెక్టులను పూర్తి చేస్తాం

లిఫ్టులతో 3.88 లక్షల ఎకరాలు సాగు

నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు




సాక్షి, సంగారెడ్డి: మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకుంటోందని.. ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రాజెక్టును కట్టి తీరుతామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని యుద్ధ ప్రాతి పదికన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామన్నారు. రాష్ట్రంలో కాళేశ్వరం, పాలమూరు, దిండి, నెట్టెం పాడు, కల్వకుర్తి, భీమా ప్రాజెక్టుల పనులను వేగంగా పూర్తి చేసి రైతులకు సాగు నీరు అంది స్తామన్నారు. సంగారెడ్డితోపాటు నారాయణ ఖేడ్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బుధవా రం మంత్రి పర్యటించారు.



 పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజర య్యారు. మంజీర నదిపై నిర్మించిన బోరంచ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర నీటి పారుదల సంస్థ ఐడీసీ పరిధిలోని ఎత్తిపోతల పథకాల ద్వారా 3.88 లక్షల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉందన్నారు. ప్రస్తుతం 1.23 లక్షల ఎకరాలకు మాత్రమే అందుతోందని, మిగతా పథకాలను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. 154 సాగునీటి ఎత్తిపోతల పథకాల మరమ్మతుకు రూ.70 కోట్లు మంజూరు చేశామన్నారు. మరో 73 ఎత్తిపోతల పథకాలను రూ.893 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. నూతనంగా నిర్మితమయ్యే ఎత్తిపోతల పథకాల ద్వారా మరో 1,114 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు.



రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శం..

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ప్రజాప్రతినిధులు కూడా సీఎం కేసీఆర్‌ అను సరిస్తున్న విధానాలను మెచ్చుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇంగ్లిష్‌ మీడియంలో గురు కులాల ఏర్పాటు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి వంటి పథకాల అమలు తీరుపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. రాష్ట్రంలో 200 ఇంగ్లిష్‌ మీడియం గురుకులాల ఏర్పాటును ప్రస్తావి స్తూ పేదరిక నిర్మూలన, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాల సాధన కోసం ఇంగ్లిషు మీడియంలో చదువుకోవాలన్నారు.  



ఉద్యమంలా హరితహారం

హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టా లని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సంగారెడ్డి మండలం చింతలపల్లిలో సమీకృత హాస్టల్‌ సముదాయంలో బుధ వారం మూడో విడత హరితహారాన్ని మొక్కలు నాటి ప్రారం భించారు. మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ కింద గుంతలు తీయడంతోపాటు ఎరు వులను ఉచితంగా ఇస్తామన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం నుంచి జహీరాబాద్‌ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా 3 వరుసల్లో ఒకే రోజు మొక్కలను నాటేందుకు ప్రణాళిక రూపొందించాల్సిందిగా కలెక్టర్‌ మాణిక్కరాజ్‌ కణ్ణన్‌ను ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top