వారిని ఉరితీసినా పాపం లేదు

వారిని ఉరితీసినా పాపం లేదు - Sakshi


అడుగడుగునా ప్రాజెక్టులను అడ్డుకుంటారా?

విపక్షాలపై మంత్రి హరీశ్‌ ధ్వజం

మీకు రైతుల ఉసురు తగలడం ఖాయం




సిద్దిపేట జోన్‌: ప్రాజెక్టులను అడ్డుకునే వారిని ఉరితీసినా పాపం లేదని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కోటి ఎకరాల మాగాణి లక్ష్యంగా తాము ముం దుకు సాగుతుంటే.. ఆ ప్రాజెక్టులను అడ్డుకునే దిశగా ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపిం చారు. గురువారం సిద్దిపేటలో పలు కార్యక్రమా ల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని పాలించిన సమైక్య పాలకులు ఏనాడైనా ఒక్క ప్రాజెక్టును నిర్మించారా? ఒక్క చెరువునైనా మరమ్మతు చేశారా? కనీసం ఒక్క కాలువనైనా  తవ్వారా? అని ప్రశ్నించారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే తెలంగాణ భూములన్నీ బీడుగా మారాయని, అన్నదాత పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.



గోదావరి జలాలతో రైతు రెండు పంటలు పండిస్తే తమ పార్టీల అడ్రస్‌ గల్లం తవుతుందని కాంగ్రెస్‌ పార్టీ ప్రాజెక్టులను అడ్డుకు నేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. మేడిగడ్డ వద్ద ఆందోళనలు.. ప్రాజెక్టులు వద్దని ధర్నాలు నిర్వహించడమే కాకుండా ఎప్పుడో మరణించిన వారి పేరిట కోర్టుల్లో దొంగ సంతకాలతో కేసులు వేయడం ఏ సంస్కృతి అని మంత్రి ప్రశ్నించారు. ప్రాజెక్టులను అడ్డుకుం టున్న విపక్షాలకు రైతుల ఉసురు తగలడం ఖాయమన్నారు.



ఇటీవల మెదక్‌ జిల్లాలో అత్యధికంగా ఆత్మహత్యలు జరిగాయని వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్‌ కోదండ రాం అంతకు ముందు జరిగిన ఆత్మహత్యలకు బాధ్యులు ఎవరో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. గత పాలకుల పాప ఫలమే తెలంగాణ లో ఆత్మహ త్యలకు కారణం కాదా? అని ఆయన ప్రశ్నించారు. అంగన్‌వాడీ, ఆర్టీసీ, వీఆర్‌ఏల వేత నాలను పెంచితే ప్రతిపక్షాలకు కడుపు ఎందుకు నొస్తోందని హరీశ్‌ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సంక్షేమం కోసం ముందుకు సాగు తోందని, ఆ దిశగా రైతు పండిం చిన పంటను కొనుగోలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top