మంత్రిగారూ.. మాటియ్యరూ...

మంత్రిగారూ.. మాటియ్యరూ... - Sakshi


కనీస వసతులు కరువు

కాలగర్భంలో పంచకూటాలయం

మోక్షం లేని మల్లూరు రోడ్డు

మంత్రి చొరవ చూపాలని కోరుతున్న ప్రజలు


 

పర్యాటక కేంద్రాలు అనగానే జిల్లాలో మొదటగా గుర్తుకొచ్చేవి ములుగు పరిధిలోని లక్నవరం సరస్సు, రామప్ప, మల్లూరు ఆలయాలు. ఏళ్ల తరబడి ఇవి నిరాద రణకు గురవుతున్నాయి. ఈ ప్రాంతం నుంచే మంత్రిగా ఎదిగిన చందూలాల్ నేడు జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యం లో పర్యాటక ప్రాంతాల దుస్థితిపై కథనం..

 

ములుగు  : నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. దీంతో సందర్శకులు, విదేశాల నుంచి వచ్చే యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. సుమారు 12వ శతాబ్దంలో నిర్మించిన రామప్ప ఆలయం, చెరువు ప్రసిద్ధి గాంచాయి. ప్రతీ ఏడాది లక్షలాది మంది పర్యాటకులు రామప్ప కు వస్తుంటారు. దేశవిదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇక్కడ పర్యాటకులు, భక్తులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కనీ సం మంచినీరు, మరుగుదొడ్లు ఏర్పా టు చేయకపోవడం బాధాకరం. ఆల యం నుంచి చెరువు ప్రాంతానికి సింగి ల్ రోడ్డు మాత్రమే ఉంది. అది కూడా శిథిలావస్థకు చేరింది. ఆలయానికి వెళ్లే దారిని నాలుగు లేన్లుగా మార్చి, చెరువు కట్టపై, ఆలయం లో పర్యాటకుల కోసం కనీస వసతులు కల్పిస్తే బాగుంటుంది. వెంకటాపురం మండలం రామాం జపూర్ శివారులోని పంచకూటాలయం పిచ్చిమొక్కల మధ్య దర్శనమిస్తోంది. 2012 కాకతీయ శతాబ్ది ఉత్సవాల ముందు సందడి చేసిన ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణాన్ని పట్టించుకోలేదు. పునర్నిర్మాణం కోసం శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని తొలగించారు.



లక్నవరం



బుస్సాపూర్ సమీపంలో ఉన్న లక్నవరం చెరువు ప్రత్యేకతను చాటుకుంటోం ది. ఓ వైపు దట్టమైన అడవి, మరో వైపు లోయ వీటి మధ్య ప్రయాణం కాస్త ఇబ్బంది పెడుతుంది. రామప్ప తరహాలో ఇక్కడ కూడా మహిళలు, చిన్నారులకు కనీస వసతు లు కరువయ్యాయి. చెరువులో ఉన్న ఏడు ఐలాండ్‌లను ఒక్కో విధంగా తీర్చిదిద్దితే పర్యాటకులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఉయ్యాల వంతెన, కాటేజీలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కాకరకాయల దీవికి మరో వంతెన నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నా.. మోక్షం లభించలేదు.



రోడ్డు సౌకర్యం లేని మల్లూరు



మంగపేట మండలం మల్లూరు మహా క్షేత్రం ఆధ్యాత్మికంగా.. పర్యాటకంగా పేరు గాంచింది. ఆలయానికి భక్తులు, పర్యాటకులు ప్రతి శని, ఆది, గురువారాల్లో పెద్ద సంఖ్యలో వస్తుంటారు. హేమాచల నర్సింహస్వామి మహిమ గల వాడని ప్రజల నమ్మకం. గుట్టపై ఉన్న ఆలయానికి వెళ్లాలంటే సుమారు 5 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. క్షేత్రానికి వెళ్లడానికి కనీసం రోడ్డు లేకపోవడం నాయకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. భక్తులు విడిది చేసేందుకు కాటేజీలు నిర్మించాల్సి ఉంది. ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి నిత్యం వందలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఏటా సుమారు రూ.40లక్షలకుపైగా ఆదాయం సమకూరుతుంది. ఇక్కడ రోడ్డు, మంచి నీరు, మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉంది.

 

ప్రచారం లేని హరిత వనాలు



రామప్ప, లక్నవరం, ములుగు మండలం ఇంచర్ల పరిధిలో ఎకో టురిజం అధికారులు పచ్చటి వనాల మధ్య హరిత హోటళ్లను నిర్మించారు. కానీ వీటిపై ప్రచారం చేయడంలో విఫలమయ్యారు. కేవలం డబ్బున్న వారికే హరిత హోటళ్లు పరిమితమవుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. కాగా, నియోజకవర్గంపై పూర్తి పట్టున్న మంత్రి చందూలాల్ పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారిస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.

 

నేడు మంత్రి చందూలాల్ రాక



హన్మకొండ/ములుగు : రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ మంగళవారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా వస్తున్న చందూలాల్‌కు 11.15 గ ంటలకు మడికొండలో టీఆర్‌ఎస్ శ్రేణులు భారీ స్వాగతం పలకనున్నాయి. 11.30కు అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పిస్తా రు. 11.40 కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి, మధ్యాహ్నం 12 గంటలకు ములుగుకు బయలుదేరుతారు. 12.45కు మహ్మద్‌గౌస్‌పల్లికి చేరుకుం టారు. బైక్ ర్యాలీతో మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రేమ్‌నగర్ గట్టమ్మ ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. 1.20కు డీఎల్‌ఆర్ గార్డెన్స్‌లో జరిగే సభకు హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top