ఊరంతా విద్యుత్‌షాక్ : ఒకరు మృతి

ఊరంతా విద్యుత్‌షాక్ : ఒకరు మృతి - Sakshi


మెదక్ రూరల్ : ఎర్తింగ్ లోపం కారణంగా ఊరంతా విద్యుత్ షాక్ రావడంతో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఒకరు మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చౌట్లపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా అవుతోంది. కాగా కొద్ది రోజులుగా గ్రామంలో ఎర్తింగ్ లోపం కారణంగా విద్యుత్ షాక్ వస్తోంది. శుక్రవారం కూడా ఊరంతా షాక్ వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గ్రామానికి చెందిన మిద్దింటి ముత్యం (45) సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ విద్యుదాఘాతానికి గుైరె  కిందపడిపోయాడు.



దీంతో కుటుంబ సభ్యులు అతడిని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన చాకలి లింగం సైతం సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. చీమల చంద్రయ్య ఇంట్లో స్విచ్ ఆఫ్ చేస్తుండగా షాక్ తగిలింది. కొంటూర్ భూమయ్య, కొంటూర్ అశోక్, గుంజరి భిక్షపతి, పాతూర్ యాదమ్మలతో పాటు పలువురు విద్యుదాఘాతానికి గురయ్యాడు. శుక్రవారం ఒక్క రోజే సెల్‌ఫోన్ చార్జర్లు, టీవీలు, రైస్ కుక్కర్లు, డిష్‌లతో పాటు పలువురి ఇళ్లలోని ఎలక్ట్రానిక్ పరికరాలు మొత్తం కాలిపోయాయి. సమాచారం అందుకున్న ట్రాన్స్‌కో అధికారులు గ్రామంలో  కరెంట్ సరఫరాను నిలిపివేశారు. గత ఆరునెలల క్రితం ఇదే మాదిరిగా షాక్ వచ్చిందని అప్పట్లో ట్రాన్స్‌కో అధికారులు సమస్యను పరిష్కరించారు. అయితే కొద్దిరోజులుగా ఇదే పరిస్థితి నెల కొందని గ్రామస్తులు తెలిపారు.



సమాచారం అందుకున్న రూరల్ ఎస్‌ఐ వినాయక్‌రెడ్డి, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఎంపీపీ లక్ష్మి, ట్రాన్స్‌కో ఏడీ రామచంద్రయ్య, ఏఈ తిరుపతయ్యల గ్రామానికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యుదాఘాతానికి గుైరె   మృతిచెందిన ముత్యం మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రి తరలించారు. మృతుడికి మతిస్థిమితం లేని భార్య లక్ష్మితో పాటు 20 ఏళ్ల లోపు వ యస్సు గల ముగ్గురు కుమారులున్నా రు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ మేకల సునీత, ఎంపీటీసీ సభ్యుడు శ్రీకాంత్‌లు కోరారు.



ఎస్‌ఐ ఔదార్యం : నిరుపేద కుటుంబానికి చెందిన  మిద్దింటి ముత్యం విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడగా ఆయన కుటుంబం స్థితిగతులను తెలుసుకున్న రూరల్ ఎస్‌ఐ వినాయక్‌రెడ్డి రూ. 5,000 ఆర్థిక సాయాన్ని మృతుడి కుటుంబానికి అందించి  ఔదార్యాన్ని చాటుకున్నాడు.

 

ఎర్త్ లోపం వల్లే షాక్ : గ్రామంలోని పలు ఇళ్లకు విద్యుత్ షాక్ రావడానికి కారణం సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ ఎర్తింగ్ లోపం కారణంగానే గ్రామానికి షాక్‌వచ్చిందని ట్రాన్స్‌కో ఏడీ రామచంద్రయ్య తెలిపారు. కాగా విద్యుత్ శాఖ నుంచి రూ. లక్ష మృతుడి కుటుంబానికి ఇప్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top