మిద్దె రాములు పురస్కారాల ఏర్పాటుకు కృషి

హంస అవార్డును చుక్క సత్తయ్య కుమారుడు అంజనేయులుకు అందజేస్తున్న రమణాచారి


కరీంనగర్ : ప్రముఖ ఒగ్గుకథ కళాకారుడు కరీంనగర్ జిల్లాకు చెందిన మిద్దె రాములు పేరిట స్మారక కళా పురస్కారాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ.రమణాచారి అన్నారు. మిద్దె రాములు నాలుగో వర్ధంతి సభ కరీంనగర్‌లో మంగళవారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాకారులు భగవత్ స్వరూపాలని కొనియాడారు.

 

  మిద్దెరాములు గురించి చెప్పడమంటే కొండను అద్దంలో చూపించడమే అవుతుందన్నారు. 2013 సంవత్సరానికి ప్రతిభా పురస్కార్‌ను ఒగ్గుకథ కళాకారుడు రాజీవ్‌కు, హంస అవార్డు గ్రహీత చుక్క సత్తయ్య అవార్డును ఆయన తనయుడు అంజనేయులుకు, 2014 సంవత్సరానికి మిద్దె రాములు పురస్కారాన్ని జానపద కళాకారుడు ఎస్.ప్రభాకర్‌కు అందజేసి సత్కరించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top