‘మెట్రో’ పవర్

‘మెట్రో’ పవర్ - Sakshi

  •  రైళ్లలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం

  •  ఆదాకానున్న 30 శాతం విద్యుత్

  • సాక్షి,సిటీబ్యూరో: భాగ్యనగరంలో దూసుకుపోనున్న మెట్రో రైళ్ల ద్వారా భారీగా విద్యుత్ మిగలనుంది. రైళ్లలో ఏర్పాటు చేసిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇది సాధ్యం కానుంది. పట్టాలపై పరిగెడుతున్న రైలు బ్రేక్ వేసినపుడు ఉత్పన్నమయ్యే శక్తితో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనిని బోగీల్లో వినియోగించుకునే విధంగా సాంకేతిక విధానాన్ని అమర్చారు. దీని ద్వారా 30 శాతం విద్యుత్ ఆదా అవుతుందని హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు ఎండీ న్వీఎస్ రెడ్డి తెలిపారు.  

     

    నగరంలో మూడు కారిడార్లలో 72 కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైళ్లు పరుగులు తీయనున్నాయి. మెట్రో రైళ్లు, స్టేషన్లు, డిపోలు, సిగ్నళ్లు, ట్రాక్‌లను నియంత్రించేందుకు ఉప్పల్‌లో ఆపరేషన్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి రోజు 7.63 లక్షల యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఇందుకోసం తెలంగాణ  రాష్ట్ర ట్రాన్స్‌కో విభాగం ఆధ్వర్యంలో ఉప్పల్, మియాపూర్‌ల్లోని మెట్రో డిపోలు,యూసుఫ్‌గూడా, ఎంజీబీఎస్‌ల వ ద్ద 132 కేవీ సామర్థ్యంగల  4 విద్యుత్ గ్రాహక సబ్‌స్టేషన్లను(ఆర్‌ఎస్‌ఎస్)ఏర్పాటు చేశారు.



    మెట్రో రైళ్లు,స్టేషన్లు, ట్రాక్‌లు, డిపోలకు 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా వీటిని నిర్మించామని  హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.  విద్యుత్ లైన్లలో సాంకేతిక లోపం తలెత్తినావేరే ఫీడర్‌ద్వారా క్షణాల్లో విద్యుత్  సరఫరాను పునరుద్దరించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.  ఉప్పల్‌లో రిసీవింగ్ సబ్‌స్టేషన్ పనిచేయడం ప్రారంభించిందన్నారు. ఈ నెలలో నాగోల్-మెట్టుగూడా రూట్లో ట్రయల్న్ ్రనిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే మెట్రో ట్రాక్, సిగ్నలింగ్,స్టేషన్ల నిర్మాణం పనులు దాదాపు పూర్తికావచ్చాయని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top