విద్యార్థులంతా ఆ మూడు గ్రామాల వారే


హైదరాబాద్ : మెదక్ జిల్లా రైలు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో ఘటనా ప్రాంతం దద్దరిల్లిపోయింది. స్కూల్కు పంపిన తమ చిన్నారులు విగత జీవులుగా మారటంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.


ఈ దుర్ఘటనలో మృతి చెందిన విద్యార్థులు ఇస్లాంపూర్, వెంకటాపల్లి, గూనేపల్లి గ్రామాలకు చెందినవారు. తుప్రాన్లోని కాకతీయ ప్రయివేట్ స్కూలు బస్సు ....గురువారం ఉదయం ఇస్లాంపూర్ నుంచి విద్యార్థులను  తీసుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నాందేడ్ ప్యాసింజర్ ...నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.



కాగా ఈ ప్రమాదం జరిగిన వెంటన సమీప గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జేసీబీ సాయంతో విద్యార్థులను బయటకు తీశామని, కొన ఊపిరితో ఉన్నవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అతను కూడా మృతి చెందాడు. మొత్తం బస్సులో 38మంది ఉన్నట్లు తెలుస్తోంది.





 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top