‘మావో’ పోస్టర్ల కలకలం


 చౌటుప్పల్ : చౌటుప్పల్‌లో ఆదివారం రాత్రి మావోయిస్టుల పేరుతో వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చౌటుప్పల్ గ్రామపంచాయతీ కార్యాలయం, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, చైతన్య కళాశాల గోడలకు నాలుగు పోస్టర్లు అంటించారు. సోమవారం ఉదయం పోస్టర్లను గమనించిన స్థాని కులు పోలీసులకు సమాచారమందిం చారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ భూపతి గట్టుమల్లు సిబ్బందితో హుటాహుటీనా వెళ్లి, పోస్టర్లను తొల గిం చారు. పోస్టర్లపై అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు గడిస్తున్న రాజకీయ నాయకులకు, ప్రభు త్వ అధికారులకు శిక్ష తప్పదు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టండి. ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా ఉద్యమించండి. మోదీ, ఒబామా దిష్టిబొమ్మలను దహనం చేయండి.

 

 26న భారత్ బంద్‌ను జయప్రదం చేయం డి. ఎఫ్‌డీఐలతో లాభం పొందే రాజ కీయ నాయకులను, విదేశీ పెట్టుబడిదారులను, చిల్లర వర్తక రంగం లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను వ్యతిరేకించండి అని మావోయిస్టు పార్టీ పేరు రాసి ఉంది. కాగా, చౌటుప్పల్‌లో మండలంలో రెండు నెలల కాలంలో రెండో సారి పోస్టర్లు వెలువడడం ఆందోళన కలిగిస్తోంది. డిసె ంబర్ 4వ తేదీన తాళ్లసింగారం, లింగోజిగూడెం, మందోళ్లగూడెం,పెద్దకొండూరు గ్రామాల్లో పోస్టర్లు వెలువడిన విషయం తెలిసిందే. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలువడగా, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అవినీతి రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులను హెచ్చరిస్తూ, పోస్టర్లు వెలిశాయి.  మండలంలో ఇటీవలి కాలంలో పోస్టర్లు వెలుస్తుండడంతో మావోల కదలికలపై అనుమానం రేకెత్తుతోంది. పైకి పోలీసులు ఆకతాయిల ప నేనని పైకి కొట్టిపారేస్తున్నారు.

 

 సానుభూతిపరుల పనే: డీఎస్పీ మోహన్‌రెడ్డి

 చౌటుప్పల్ మండలంలో వెలిసిన మావోయిస్టు పోస్ట ర్లు సానుభూతిపరుల పనిగా భువనగిరి డీఎస్పీ ఎస్.మోహన్‌రెడ్డి అభివర్ణించారు. చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్‌ను సోమవారం సందర్శించారు. మావోయిస్టు పో స్టర్లపై పోలీస్ ఇన్‌స్పెక్టర్ భూపతి గట్టుమల్లుతో మా ట్లాడారు. పోస్టర్లను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టు పోస్టర్లు వేసిన వారిని పట్టుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, భూ దాన్ పోచంపల్లి, రామన్నపేట, వలిగొండ మండలాలకు చెందిన దాదాపు 150మంది మావోయిస్టు సానుభూతిపరులను అదుపులోకి తీసుకుని, విచారించామన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తహసీల్దార్‌ల ఎదుట బైండోవర్లు కూడా చేశామన్నారు. పోస్టర్లను చూస్తుంటే గతంలో మావోయిస్టులకు సానుభూతిపరులుగా పనిచేసిన వారి పనే అయి ఉంటుందని అవగతమవుతుందన్నారు. ఈప్రాం త ంలో మావోయిస్టులు పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top