అన్నను చంపిన తమ్ముడు


కమాలాపూర్ ( కరీంనగర్ ): మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి సొంత తమ్ముడి చేతిలోనే హతమయ్యాడు. ఈ సంఘటన కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఉప్పల్ గ్రామానికి చెందిన ఐలయ్య(42), యాదగిరి(35)లు అన్నదమ్ములు. ఐలయ్య రోజూ మద్యం తాగి వస్తూ ఇంట్లో గొడవకు దిగేవాడు.



ఈ క్రమంలో శుక్రవారం బాగా మద్యం సేవించి తల్లితో గొడవ పడ్డాడు. దీంతో యాదగిరి జోక్యం చేసుకుని ఐలయ్యను మందలించాడు. ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన యాదగిరి పక్కనే ఉన్న టిఫిన్ బాక్స్‌తో ఐలయ్య తలపై మోదాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఐలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top