గూడేలు గజగజ


ఏటూరునాగారం :  ములుగు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని గిరిజన తండాలు, ఎస్సీ కాలనీలు, గొత్తికోయగూడేల్లో విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఫలితంగా ఇంటికొకరు చొప్పున మంచంపట్టారు. సర్కారు వైద్యులు రోగులకు సరైన చికిత్స అందించకపోవడంతో బాధితులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానిక ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజూ మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికున్‌గున్యా, పైలేరియా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.



 ఆస్పత్రుల్లో జ్వర పీడితులు

 ఏటూరునాగారానికి చెందిన దేపాక నర్సయ్య, డొంగిరి రమాదేవి, కొల్ల సరోజన, సంతగాని రజిత, కోరం మానస, కోడి దుర్గు (విద్యార్థిని), చిదరపు సరోజన జ్వరంతో వారం రోజులుగా విలవిల్లాడుతున్నారు. వీరిని పరీక్షించాల్సిన వైద్యులు తమ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని సామాజిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు తెలిపారు.



 మంగపేట మండలంలోని శనిగకుంట గ్రామానికి చెందిన ఆక శ్రీనివాస్ (38) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతూ స్థానిక  ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏటూరునాగారం మండలంలోని తాళ్లగడ్డకు చెందిన పానిగంటి శ్రీనివాస్ వారం రోజులగా డెంగీతో బా ధపడుతున్నారు. ప్రస్తుతం హన్మ కొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ ఇప్పటి వరకు వైద్యఖర్చు ల కోసం రూ.30వేలు ఖర్చుచేసినట్టు తెలిపారు.



 నిర్లక్ష్యపు నీడలో..

 పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణకు సరిపడా నిధులున్నా పనులు చేపట్టకుం డా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. గ్రామాల్లో ఎక్కడ చూసినా బురదగుంతలు, చెత్తాచెదారం, కుళ్లిన వ్యర్థాలే కనిపిస్తున్నాయి. వీటిని ఆవాసంగా చేసుకుంటున్న దోమలు విజృంభిస్తున్నా యి. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణతోపాటు క్లోరినేషన్ చేపట్టి జ్వరాలను అరికట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top