మాయమ్మా... మైసమ్మా..! ఏమయ్యావమ్మా..?!

చెరువు కట్టపై కనిపించని కట్ట మైసమ్మ రాతి విగ్రహం

 

కట్ట మైసమ్మ తల్లి ఎక్కడుంటుంది..?చెరువు కట్టపై..!

ఎప్పటి నుంచో ఆ చెరువు కట్టపై భక్తుల పూజలందుకుంటున్న ఆ మైసమ్మ తల్లి... సోమవారం అర్థరాత్రి మాయమైంది..!!

ఆందోళన, ఆవేదన మిళితమైన స్వరంతో ఆ గ్రామస్తులు ఇలా ప్రశ్నిస్తున్నారు... ‘మాయమ్మా... మైసమ్మా..! ఎక్కడికెళ్లావమ్మా... ఏమయ్యావమ్మా..? మాయమయ్యావా.. మాయం చేశారా..?!’

 

మధిర:  చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలోని ఊర చెరువుపై కట్ట మైసమ్మ తల్లి రాతి విగ్రహం ఎప్పటి నుంచో ఉంది. భక్తుల పూజలు అందుకుంటోంది. పక్కనే పోతురాజు విగ్రహం కూడా ఉంది.మంగళవారం ఉదయమే కూలీ,పొలం పనులకు కట్ట మీదుగా వెళుతున్న కొందరికి.. అక్కడ ఉండాల్సిన రెండు విగ్రహాల్లో ఒకటి (మైసమ్మ తల్లి) కనిపించలేదు. ముందు రోజు (సోమవా రం) సాయంత్రం కూడా తమకు కనిపిం చిన కట్ట మైసమ్మ తల్లి విగ్రహం.. ఇంతలోనే ఎలామాయమైందన్న సందేహం వచ్చింది.

 

గ్రామంలోకి వెళ్లి మిగతా అందరికీ చెప్పారు. అంద రూ కలిసి అక్కడకు చేరుకున్నారు. చుట్టుపక్కల వెతికారు. ఎక్కడ కని పించలేదు. సర్పంచ్‌గొడుగు రమేష్, ఎం పీటీసీ సభ్యుడు కొప్పుల గోవిందరావు ఇచ్చిన సమాచారంతో ఆ చెరు వు కట్ట వద్దకు ఎస్సై పోగులసురేష్‌ వచ్చారు. పోతురాజు విగ్రహం ఒక్కటే ఉం డడాన్ని గమనించారు. పరిసరాలను పరిశీ లించారు. మండలంలోని ఆలయాల్లో ఇటీవల దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో.. స్థానిక గుడులను, వాటికి రక్షణ ఏర్పాట్లను పరిశీలించా రు. ఇంతకీ, కట్ట మైసమ్మ తల్లి విగ్రహం ఏమైన ట్టు..? ‘ఆ తల్లికి కాళ్లు రాలేదు. ఎక్కడికీ వెళ్లలేదు. కళ్లు, కాళ్లు.. రెండూ నెత్తికెక్కిన ఎవడో దుండగు డు.. ఆ తల్లి విగ్రహాన్ని చెరువులోకి విసిరేసి ఉం టాడేమో!’ అని,గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top