ప్రియురాలిని గొడ్డలితో నరికేశాడు!
నల్లగొండ జిల్లాలో దారుణం జరిగింది. కట్టంగూరు ఇందిరమ్మ నగర్లో ఓ ప్రేమికుడు తన ప్రేయసిని దారుణంగా హతమార్చాడు. కారణం ఏంటో తెలియదు గానీ ఏకంగా ఆమెను గొడ్డలితో నరికి చంపాడు.
మృతురాలిది నకిరేకల్ మండలం నోముల గ్రామంగా తెలుస్తోంది. కొన్నాళ్లుగా ప్రేమించిన ఆమెను హతమార్చిన అనంతరం అతగాడు పరారయ్యాడు. అతడికోసం పోలీసులు గాలిస్తున్నారు.
సంబంధిత వార్తలు