లోకేష్.. రాజకీయ అజ్ఞాని: బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ ఓ రాజకీయ అజ్ఞాని అని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ను విమర్శించేస్థాయి ట్విటర్ బాబుకు లేదని ఆయన ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్కు ఎదురుపడే ధైర్యం లేకనే చంద్రబాబు రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు హకీంపేట ఎయిర్పోర్టుకు రాలేదని వ్యాఖ్యానించారు. ఓటుకు కోట్లు కేసులో నామినే టెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ఫోన్లో మాట్లాడింది చంద్రబాబు అవునో.. కాదో? లోకేష్ చెప్పాలన్నారు.