పరిమిత పంపిణీ

పరిమిత పంపిణీ - Sakshi


సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నిరుపేద దళితులకు 3 ఎకరాల భూమి’ పథకం తొలి విడత జిల్లాలోని 53 గ్రామాలకే పరిమితం కానుంది. అర్బన్‌ప్రాంతంగా పేర్కొంటూ 11 మండలాలను మినహాయిస్తూ లబ్ధిదారుల గుర్తింపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

 

 జిల్లాలో 64 మండలాలకు గాను 11మండలాలను అర్బన్ మండలాలుగా పేర్కొంటూ తొలి విడత జాబితాలో చోటు కల్పించలేదు. మంత్రివర్గ నిర్ణయం ప్రకారం లబ్ధిదారుల ఎంపికను ప్రయోగాత్మకంగా ఒక్కో మండలంలో ఒక్కో గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేయాలని నిర్ణయించారు. మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో బాలానగర్, ఫరూఖ్‌నగర్, కొత్తూరు, కేశంపేట, ఆమనగల్లు, కల్వకుర్తి, మహబూబ్‌నగర్ మండలాలను తొలివిడత జాబితా నుంచి తప్పించారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాలుగా ఉ న్న నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి, నారాయణపేట మండలాలకు కూడా తొలి విడత భూ పంపిణీ జాబితాలో చోటుదక్కడం లేదు.

 

 మి గతా 53 మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపికచేసి లబ్ధిదారుల సంఖ్య, భూ లభ్యతపై అధికారయంత్రాంగం దృష్టిసారించింది. లబ్ధిదారుల ను గుర్తించే బాధ్యతను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు అప్పగించి.. ఆగస్టు 15వ తేదీలోగా ల క్ష్యాన్ని నిర్దేశించారు. అయితే చాలాగ్రామాల్లో ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడం, ఉన్నా సాగుకు యోగ్యంగా లేకపోవడం పథ కం అమలుకు అవరోధం కలుగనుంది. ప్రభు త్వ భూమి అందుబాటులో లేనిచోట పట్టా భూములను కొనుగోలు చేయాలని అధికారు లు ప్రతిపాదిస్తున్నారు. జిల్లాలో మారుమూల ప్రాంతంలోనూ బహిరంగమార్కెట్లో ఎకరా ధర రూ.3 లక్షలకు పైగా పలుకుతోంది. దీంతో భూ సేకరణకు ఒక్కో గ్రామంలో కనీసం రూ.3 కోట్ల నుంచి రూ.5కోట్ల వెచ్చించాల్సి ఉంటుం దని అంచనా. గరిష్టంగా ఒక్కోగ్రామంలో 30మందిని మాత్రమే లబ్ధిదారులుగా ఎంపికచేస్తారనే ప్రచారంపై ఆందోళన వ్యక్తమవుతోంది. భూ సేకరణకు కోట్లాది రూపాయలు వెచ్చించాల్సి రావడం, లబ్ధిదారుల ఎంపిక ఓ కొలిక్కిరాకపోవడంతో ఆగస్టు 15న పథకం ప్రారంభంపై ఆశావహులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

 లబ్ధిదారుల గుర్తింపుపై శిక్షణ

 ఎంపికచేసిన 53 పంచాయతీల్లో ఎస్సీల జీవనస్థితిపై సర్వే చేసిన తర్వాతే లబ్ధిదారుల ఎంపికపై స్పష్టత రావాలని ప్రభుత్వం భావిస్తోంది. సేకరించాల్సిన సమాచారంపై ఇప్పటికే రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన డీఆర్‌డీఏ, ఐకేపీ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.

 

  పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌ఓలు, కమ్యూనిటీ సర్వేయర్లు, పారా లీగల్, సామాజిక తనిఖీ కార్యకర్తలు మొత్తం 210మందిని శిక్షణకు ఎంపిక చేశారు. ఎంపిక చేసిన గ్రామాల్లో దళిత కుటుంబాలకు సంబంధించిన ఆస్తి, భూ వివరాలతో పాటు ఇతర అంశాలు నిర్ణీత ఫార్మాట్‌లో సేకరిస్తారు. 2010లో డీఆర్‌డీఏ ద్వారా సేకరించిన అత్యంత నిరుపేదలు (పీఓపీ) సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకుని సర్వే చేస్తామని అధికారులు చెబుతున్నారు.

 

 ఎంపికచేసిన గ్రామాలివే..

 మహబూబ్‌నగర్ డివిజన్  ఇప్పటూరు (నవాబుపేట మండలం), కొడిగల్ (జడ్చర్ల), వేపూరు (హన్వాడ), లింగాల్‌చెడ్ (కోయిలకొండ), కొత్తూరు (మిడ్జిల్), జూపల్లి (వెల్దండ), మక్తమాదారం (తలకొండపల్లి), రావిర్యాల (కొందుర్గు), పోల్కంపల్లి (వంగూరు), ఇప్పలపల్లి (భూత్పూర్), తునికినిపూర్ (అడ్డాకుల), ఇర్విన్ (మాడ్గుల)

 నాగర్‌కర్నూల్ డివిజన్

 సిర్సవాడ (తాడూరు), జమిస్తాపూర్ (తెల్కప ల్లి),అలీపూర్ (బిజినేపల్లి), పోతిరెడ్డిపల్లి (తి మ్మాజీపేట), పులిజాల (అచ్చంపేట), తుమ్మన్‌పేట (బల్మూరు), తుర్కపల్లి (అమ్రాబాద్), మానాజిపేట (లింగాల), అయ్యవారిపల్లి (ఉ ప్పునుంతల), చింతన్‌పల్లి (కొల్లాపూర్), మై లారం (కోడేరు), జొన్నలబొగుడ (పెద్దకొత్తపల్లి).

 

 గద్వాల డివిజన్

 అల్వాలపాడు (ధరూరు), మిట్టదొడ్డి (గట్టు), పాల్వాయి (మల్దకల్), సింగవరం (అలంపూర్), చిన్నతాండ్రపాడు (అయిజ), షాబాద్ (ఇటిక్యాల), కలకుంట్ల (మానవపాడు), కోయిల్‌దిన్నె (వడ్డేపల్లి).

 

 వనపర్తి డివిజన్: తల్పనూరు(గోపాలపేట),ఉమ్మలపల్లి(కొత్తకో ట), అన్‌పహాడ్ (ఘనపూర్), వెంగళాయిపల్లి (పాన్గల్), యాపర్ల (పెబ్బేరు), దొడగుంటప ల్లి (పెద్దమందడి), వెలుగొండ (వీపనగండ్ల).

 నారాయణపేట డివిజన్: కర్ని (మక్తల్), చే గుంట(మాగనూరు),ఎడవెళ్లి(ఉట్కూరు),పుష ల్‌పహాడ్ (ధన్వాడ), మెడ్డెపల్లి (ఆత్మకూరు), ఉండ్యాల(సీసీకుంట),జిన్నారం(నర్వ), హాజి లాపురం (దేవరకద్ర), రుద్రారం (కొడంగల్), నాగిరెడ్డిపల్లి (బొంరాస్‌పేట), గుండుమాల్ (కోస్గి), నౌడిపెడ్ (మద్దూరు), గోకఫస్లాబాద్ (దౌల్తాబాద్), ఉడ్ముల్‌గిద్ద (దామరగిద్ద).

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top