కలిసికట్టుగా పనిచేద్దాం


టీడీపీని తిరుగులేని శక్తిగా చేద్దాం

{పాణహిత చేవెళ్ల జాతీయహోదా  కోసం పోరాడుదాం

మినీ మహానాడులో నేతల పిలుపు


 

 టవర్‌సర్కిల్ : ‘పార్టీ పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పుడు అండగా నిలిచిన కార్యకర్తలను పార్టీ ఎన్నడూ మరిచిపోదు... పార్టీ నుంచి ఎంత మంది నేతలు వెళ్లినా... అంతకంటే రెట్టింపు సంఖ్యలో నేతలను తయారు చేసే శక్తి టీడీపీకి ఉంది.. టీడీపీని బలహీనపరచాలని టీఆర్‌ఎస్ కుయుక్తులు పన్నుతోంది, కార్యకర్తలు గురుతర బాధ్యతతో కలిసికట్టుగా పనిచేసి పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చి తిరుగులేని శక్తిగా తయారు చేయాలి’ అని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కార్యకర్తలను కోరారు. స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో శనివారం టీడీపీ మినీ మహానాడు సభ నిర్వహించారు.



ముఖ్యఅతిథిగా హాజరైన రమణ, దయూకర్‌రావు మాట్లాడుతూ.. మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేవరకు పోరాటం చేస్తామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని దుయ్యబట్టారు. కార్యకర్తలు నిస్వార్థంగా, నిజాయితీగా పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారని, టీడీపీకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న 2019 సాధారణ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరాలన్నారు.





 అవినీతి టీఆర్‌ఎస్‌ను ఎండగడదాం : విజయరమణారావు

 అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోరుుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు విమర్శించారు. అవినీతి టీఆర్‌ఎస్‌ను ఎండగట్టాలని కార్యకర్తలను కోరారు. సంక్షేమ పథకాలు, సబ్సిడీలు టీఆర్‌ఎస్ కార్యకర్తలకు అందుతుంటే మంత్రి ఈటెల రాజేందర్ అవినీతి లేదనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు కర్రు నాగయ్య, ముద్దసాని కశ్యప్‌రెడ్డి, మేడిపల్లి సత్యం, అన్నమనేని నర్సింగరావు, పి.రవీందర్‌రావు, కవ్వంపల్లి సత్యనారాయణ, నాయకులు సంకు సుధాకర్, రావుల రమేశ్, రాజునాయక్, కళ్యాడపు ఆగయ్య, చెల్లోజి రాజు, దామెర సత్యం, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



 మహానాడును బహిష్కరించిన   ‘సాంబారి’ అనుచరులు?

 కోరుట్లకు చెందిన సంకు సుధాకర్‌కు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడంతో ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి సాంబారి ప్రభాకర్ అనుచరులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది.  రాజీనామా చేస్తామని జిల్లా అధ్యక్షుడు విజయరమణారావుతో రెండు రోజులుగా వారు చెబుతున్నారు. ఈ విషయమై శనివారం కూడా పార్టీ  అధ్యక్షుడితో చెప్పినట్లు తెలిసింది. అయితే ఇన్‌చార్జి పదవికి, జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి ఎలాంటి సంబంధం లేదని, ఎవరి పనులు వారు చేసుకోవాలని విజయరమణారావు నచ్చజెప్పినట్లు తెలిసింది. అరుునా అలకవీడని ప్రభాకర్ అనుచరులు మినీ మహానాడును బహిష్కరించి వెళ్లిపోయినట్లు విశ్వసనీయ సమాచారం.



 సందెట్లో సడేమియా

 టీడీపీ మినీ మహానాడులో జేబుదొంగలు చేతివాటం ప్రదర్శించారు. కార్యకర్తలందరూ ఒకేసారి భోజనాలు చేసేందుకు వెళ్లడంతో హాలంతా కిక్కిరిసిపోయింది. ఒకరినొకరు తోసుకునే పరిస్థితి ఎదురైంది. సందెట్లో సడేమియాలా ఇద్దరు గుర్తుతెలియని పిక్‌పాకెటర్లు హాల్‌లో చొరబడి జేబుల్లోంచి డబ్బులు దొంగిలిస్తుండగా కార్యకర్తలు వారిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.



 మినీ మహానాడు తీర్మానాలు

►కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి.

►{పాణిహిత-చేవెళ్లకు జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి.

► రైతుల, చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణకు, సంక్షేమానికి సత్వర చర్యలు చేపట్టాలి.

►{పభుత్వ ఆస్పత్రుల్లో వసతులు కల్పించాలి.

►ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయూలి.

►మహిళల రక్షణ, భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలి.

     అమర వీరుల అన్ని కుటుంబాలను గుర్తించి ఎక్స్‌గ్రేసియా అందజేయాలి.

     బీడీ కార్మికులందరికీ పింఛన్లు మంజూరు చేయూలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top