పారిశుధ్య లోపంపై నిరసన

పారిశుధ్య లోపంపై నిరసన


- కడెంలో ప్రజల రాస్తారోకో

- సందర్శించిన ఎమ్మెల్యే రేఖ

కడెం :
పారిశుధ్య లోపం కారణంగా కడెంలో విషజ్వరాలు, డెంగీ ప్రబలుతున్నా అధికారులు పట్టించుకోవ డం లేదని ఆరోపిస్తూ స్థానికులు గురువారం ఆందోళనకు దిగారు. దాదాపు వంద మందికి పైగా స్థానికులు జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో నిర్మల్-మంచి ర్యాల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డ్రెయినేజీలను శుభ్రం చేయించాలని, పందులను గ్రామానికి దూరంగా తరలించడంతో పాటు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో సరిపడా సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. కాగా, రాస్తారోకో కారణంగా వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి.

 

కలెక్టర్‌తో మాట్లాడిన ఎమ్మెల్యే


కడెంలో స్థానికులు రాస్తారోకో చేస్తున్నారన్న సమాచా రం తెలుసుకున్న ఎమ్మెల్యే రేఖానాయక్ వ చ్చారు. గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితు లు తెలుసుకున్న ఆమె.. ఫోన్‌లో కలెక్టర్‌కు పరిస్థితిని వివరించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది నియామకం, పారి శుధ్య పరిస్థితిపై తెలిపారు. పారిశుధ్య ప నులు చేపట్టడంతో పాటు పందుల తరలింపు చర్యలు చేపట్టాలని తహశీల్దార్ నర్సయ్య, ఎంపీడీవో విలాస్‌ను ఆదేశిం చారు. అనంతరం ఎమ్మెల్యే స్థానికులతో కలిసి ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించగా, డ్యూటీ డాక్టర్ లేరు. ఈ మేరకు ఎమ్మెల్యే రేఖ మాట్లాడుతూ ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు తక్కళ్ల సత్యనారాయ ణ, రఫీఖ్, మీనాజ్, సయ్యద్ ఆశాం, కలీం తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top