మైక్‌ కట్‌... కోమటిరెడ్డి ఆగ్రహం

మైక్‌ కట్‌... కోమటిరెడ్డి ఆగ్రహం - Sakshi


నల్లగొండ జిల్లాలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, మెడికల్‌ కళాశాల ఏర్పాటు అంశంపై మాట్లాడేందుకు స్పీకర్‌ మైక్‌ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. నల్లగొండ జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలపై పత్రికల్లో వచ్చిన వార్తల ను ఆయన చదివి వినిపిస్తుండగా మంత్రి హరీశ్‌ రావు అడ్డుచెప్పారు. ప్రతిపక్ష నేత జానారెడ్డిని ఉద్దేశించి ‘మాకు నీతి సూత్రాలు చెబుతారు.



మీ సభ్యుడికి చెప్పరా?’ అని ప్రశ్నించారు. దీంతో కోమటి రెడ్డి మైక్‌ను స్పీకర్‌ కట్‌ చేసి కాసేపటికి మళ్లీ ఇచ్చారు. అయినప్పటికీ కోమటిరెడ్డి ఆంగ్ల పత్రికల్లో వచ్చిన వార్తలను చదివే ప్రయత్నం చేయడంతో స్పీకర్‌ మళ్లీ మైక్‌ కట్‌ చేశారు. దీనిపై కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా స్పీకర్‌ మైక్‌ ఇవ్వలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top