‘కమలం’లో నూతనోత్సాహం

‘కమలం’లో నూతనోత్సాహం - Sakshi


ఇబ్రహీంపట్నం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పర్యటన ఇబ్రహీంపట్నం నియోజక వర్గం బీజేపీ శ్రేణులల్లో నూతనోత్సాహన్ని నింపింంది. ఈ కార్యక్రమంలో పూర్వనేతలుసొంతగూటికి చేరుకోవడంతోపాటుగా మరికొంతమంది ప్రముఖులు బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఆ పార్టీకి కొంతమేర బలాన్ని ఇచ్చిందనే చెప్పొచ్చు.



బీజేపీ అసెంబ్లీ నియోజక క న్వీనర్ ముతాల్య భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో టీడీ పీ సీనియర్ నాయకుడు గుర్రం శ్రీనివాస్‌రెడ్డితోపాటు ప్రముఖ న్యాయవాది అంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో పది మంది న్యాయవాదులు బీజేపీలో చేరారు. గు ర్రం శ్రీనివాస్‌రెడ్డి బీజేపీ మండల పార్టీ నేతగా, జిల్లా నేతగా బాధ్యతలు నిర్వహించి కొంతకాలం క్రితం టీడీపీలో చే రారు. ఇదే కార్యక్రమంలో కందుకూరు ఎంపీపీ అశోక్ కూడా బీజేపీలో చేరారు.



కాషాయమయం

కిషన్‌రెడ్డి పర్యటనను పురస్కరించుకున ని ఆ పార్టీ నేతలు ఇబ్రహీంపట్నాన్ని  కాషాయమయం చేశారు. శేరిగూడ నుంచి ఇబ్రహీంపట్నం వరకు భారీ స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో పార్టీ పతాకావిష్కరణను పురస్కరించుకుని భారీగా ప్లెక్సీలతో హోరెత్తించారు.ఈ సందర్భంగా నగరపంచాయతీ కౌన్సిలర్లు ముత్యాల భాస్కర్, బండి విజయనిర్మల,నాయిని సత్యనారాయణ, టేకుల రాంరెడ్డిల ఆధ్వర్యంలో కిషన్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు.



కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్, కిసాన్‌మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొరెడ్డి అర్జున్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు దొండ రమణారెడ్డి, సర్పంచ్‌ల సంఘం నాయకురాలు పొరెడ్డి సుమతీ అర్జున్‌రెడ్డి, దళిత మోర్చా నాయకుడు బోసుపల్లి, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.



వినతి పత్రం సమర్పించిన ఎంఎస్‌ఎఫ్ నేతలు

కిషన్‌రెడ్డికి ఎంఎస్‌ఎఫ్ నేతలు కొండ్రు ప్రవీణ్‌కుమార్,ఎమ్మార్పీస్ నాయకుడు నర్కుడు అంజయ్యలు  వినతి పత్రం అందజేశారు. మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వికలాంగులు, వృద్ధాప్య, వితంతు పింఛన్‌లు అర్హులైన వారందరకీ ఇచ్చేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని  పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top