కిరోసిన్ హోల్‌సేల్ డీలర్ల ఫెడరేషన్ కార్యవర్గం

కిరోసిన్ హోల్‌సేల్ డీలర్ల ఫెడరేషన్ కార్యవర్గం


సాక్షి, సిటీబ్యూరో: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కిరోసిన్ హోల్‌సేల్ డీలర్స్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. శుక్రవారం సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో ఏపీ, తెలంగాణ రాష్ట్ర డీలర్ల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఒకటిగా ఉన్న ఫెడరేషన్‌ను విభజించి రెండు రాష్ట్రాలకు రెండు కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.



తెలంగాణ ఫెడరేషన్ అధ్యక్షుడిగా రాజం, ఉపాధ్యక్షులుగా భాస్కర్ (ఖమ్మం), జ్ఞానేశ్వర్ (మెదక్), ప్రధాన కార్యదర్శిగా టి.మనోహర్ (కరీంనగర్), కోశాధికారిగా కె.బుగ్గేశ్వర్ (రంగారెడ్డి) అదనపు ప్రధాన కార్యదర్శులుగా ధర్మేంద్ర చౌహాన్ (ఆదిలా బాద్), శ్రీనివాసగుప్త (నిజామాబాద్), గౌరవ అధ్యక్షులుగా హన్మంతు ప్రసాద్(ఖమ్మం)ను ఎన్నుకున్నారు.

 

ఏపీ అధ్యక్షులుగా కేశవరెడ్డి..



ఏపీ ఫెడరేషన్ అధ్యక్షులుగా పి.కేశవరెడ్డి(అనంతపురం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీనియర్ ఉపాధ్యక్షులుగా మాణిక్‌ప్రభు (కర్నూలు), ప్రకాశరావు (విశాఖపట్నం), ప్రధాన కార్యదర్శిగా నారాయణ(విజయవాడ), కోశాధికారిగా ముత్యాలు (విజయవాడ), జోన ల్ అధ్యక్షులుగా మదన్‌మోహన్(గుంటూరు)ను ఎన్నుకున్నారు.

 

అవసరాలకనుగుణంగా చట్టాల సవరణ: మంత్రి



అవసరాలకు అనుగుణంగా చట్టాలను సవరించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని తెలంగాణ ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఏపీ, తెలంగాణ కిరోసిన్ హోల్‌సేల్ డీలర్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ ఎంపీ సీతారాంనాయక్, ఏపీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ కిరోసిన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు అరవింద్ టక్కర్  పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top