కేసీఆర్ తొలి విదేశీ పర్యటన ఇలా..!

కేసీఆర్ తొలి విదేశీ  పర్యటన ఇలా..! - Sakshi


20,21,22 తేదీల్లో సింగపూర్‌లో ఏర్పాటు చేసిన పలు సవూవేశాల్లో కేసీఆర్ పాల్గొంటారు

23,24 తేదీల్లో కేసీఆర్ వులేషియూ పర్యటన

25న హైదరాబాద్‌కు తిరుగు ప్రయూణం


 

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తొలి విదేశీ పర్యటన మంగళవారం రాత్రి ప్రారంభమైంది. సింగపూ ర్, మలేషియాలలో ఈనెల 25 వరకు ఆయన పర్యటన సాగనుంది. ముఖ్యమంత్రితో పాటు రెవెన్యూ శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు రవీందర్ రెడ్డి, జీవన్‌రెడ్డితో పాటు సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎంఓ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి హరిప్రీత్ సింగ్, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, టీఎస్‌ఐఐసీ ఎండీ జయేశ్ రంజన్, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి మంగళవారం రాత్రి సింగపూర్ బయలుదేరి వెళ్లారు.



సింగపూర్‌లో సీఎం షెడ్యూల్:



ఆగస్టు 20: సింగపూర్‌లోని అతిపెద్ద ఇండస్ట్రియల్ పార్కుల్లో ఒకటైన ‘జురాంగ్ ఇండస్ట్రియల్ పార్కు’ను సందర్శిస్తారు. సాయంత్రం సింగపూర్‌లోని తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలతో సమావేశం

 

ఆగస్టు 21: సింగపూర్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సీఎం సమావేశం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సరళీకృత పరిశ్రమల విధానం గురించి, సింగిల్ విండో విధానం గురించి వివరించి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారిని ఆహ్వానిస్తారు.



ఆగస్టు 22:  ఐఐఎం పూర్వ విద్యార్థులు సెమినార్‌కు హాజర వుతారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే తొలి ముఖ్యమంత్రి కేసీఆరే.  సింగపూర్ ప్రధాన మంత్రి లీహ్సేన్ లూంగ్ కూడా ఈ సెమినార్‌కు హాజరవుతారు. మధ్యాహ్నం అక్కడే యూఎస్ ప్రతినిధి బృందంతో కలుస్తారు. రాత్రి ఐఐఎం పూర్వ విద్యార్థులతో విందు



మలేషియా పర్యటన వివరాలు:



 ఆగస్టు 23: రెండు రోజులు(23, 24) మలేషియా అర్బన్ డెవలప్‌మెంట్ ప్లాన్‌పై అధ్యయనం. హైదరాబాద్ పట్టణాభివృద్ధి ప్రణాళికపై దృష్టి కేంద్రీకరిస్తారు.



 ఆగస్టు 25: సింగపూర్ నుంచి భారత్ పయనం



సింగపూర్‌లో సంబరాలు....



కేసీఆర్ విదేశీ పర్యటన సందర్భంగా తెలంగాణ కల్చరల్ సొసైటీ(సింగపూర్) ఆధ్వర్యంలో ఈనెల 21న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు నిర్వహిస్తున్నారు. సింగపూర్‌లోని 397 సెంగూన్‌రోడ్డులోని పీజీపీ హాల్‌లో సాయంత్రం 6.30 గంటల నుంచి ఈ ఉత్సవాలు సాగుతాయని సొసైటీ సభ్యులు నీలం మహేందర్, అనుపురం శ్రీనివాస్ తెలిపారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top