డబుల్.. డ బుల్!


మేడ్చల్, తాండూరుకు అదనంగా 1,250 గృహాలు

 ఏప్రిల్ 30 నాటికి మేడ్చల్‌లో ప్రతి ఇంటికీ నీరివ్వాలి

 ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు

 క్యాంపు కార్యాలయంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లపై సమీక్ష


 

 సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జిల్లాపై వరాల జల్లు కురిపించారు. పేదింటి కల సాకారం చేసేందుకు జిల్లాకు అదనంగా మరో 1250 రెండు పడక గదుల ఇళ్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో వాటర్‌గ్రిడ్, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పథకంపై అధికారులతో సమీక్షించారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావు పాల్గొన్న ఈ సమావేశంలో ముఖ్యమం త్రి మాట్లాడుతూ తాండూరు, మేడ్చల్ నియోజకవర్గాలకు అదనంగా రెండు పడక గదుల ఇళ్లను మం జూరుకు ఓకే చెప్పారు. ఇళ్లకు పేదల నుంచి భారీగా డిమాండ్ ఉన్నందున అదనంగా కేటాయించాలని మంత్రి మహేందర్, సుధీర్‌లు చేసిన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన సీఎం తాండూరు పట్టణంలో జీ+1 గృహసముదాయంలో 650 ఇళ్లను, మేడ్చల్‌లో 600 ఇళ్లను అదనంగా కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు వాటర్‌గ్రిడ్ కింద వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీలోపు మేడ్చల్ నియోజకవర్గానికి గోదావరి జ లాల త రలింపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. శామీర్‌పేట మండలం ఉప్పర్‌పల్లిలో 250 ఇళ్లను కేటాయించేందుకు సీఎం అంగీకరించారు. రెండు పడక గదుల ఇళ్ల సముదాయాలు మోడ ల్ కాలనీలుగా అభివృద్ధి చేయాలని, ఇతర రాష్ట్రాలకు మోడల్‌గా నిలిచేలా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశిం చారు. ప్రతి ఇంటికీ తాగునీరందించే అంశంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని కలెక్టర్‌కు సూచిం చారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు మంచినీ టి పంపిణీ జరిగేలా చొరవ చూపాలని, స్థానిక ప్రజాప్రతినిధులను కలుపుకోవాలని ఆదేశించారు.

 

 ఐడీహెచ్ కాలనీ తరహాలో..

 తాండూరు పట్టణంలో ప్రతిపాదించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను సికింద్రాబాద్‌లోని ఐడీహెచ్ కాలనీ తరహాలో నిర్మించనున్నట్టు మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు స్థల సేకరణ కూడా పూర్తయిందని, రూ. 30కోట్ల వ్యయంతో సకల సౌకర్యాలు కల్పిస్తూ నిర్మించే ఈ కాలనీకి‘ కేసీఆర్‌నగర్’గా నామకరణం చేస్తామని చెప్పారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top