'లెండి' పూర్తికి సహకరించండి

'లెండి' పూర్తికి సహకరించండి - Sakshi

- మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నీవీస్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ

- ప్రాజెక్టు జాప్యంతో  పెరిగిన అంచనా వ్యయం

- రూ.275కోట్ల నుంచి రూ.554కోట్లు పెరిగిన వ్యయం

సాక్షి, హైదరాబాద్

 అంతరాష్ట్ర ప్రాజెక్టుగా ఉన్న లెండిని త్వరితగతిన పూర్తి చేయాలని, దీనికి సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు తోడ్పడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు విన్నవించారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రాసిన లేఖను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం స్వయంగా ఫడ్నీవీస్‌కు అందించారు. 2014జులై 23న ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖా మంత్రులు లెండిపై చర్చించారని, 2015 ఫిబ్రవరి 17న మరోసారి చర్చించారని ముఖ్యమంత్రి తన లేఖలో గుర్తు చేశారు.

 

 

లెండికి వసరమైన అనుమతులు తీసుకోవాలని, పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కేసీఆర్ లేఖలో కోరారు. ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం వద్ద అనుమతులు తీసుకోవడంలో వేగం పెంచాలన్నారు. ప్రాజెక్టు కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ.183,83కోట్లు మహారాష్ట్ర ప్రభుత్వానికి డిపాజిట్ చేసిందని, అయితే సుదీర్ఘ జాప్యం వల్ల ప్రాజెక్టు వ్యయం రూ.275.83కోట లనుంచి రూ.554.54కోట్లకు పెరిగిందరి గుర్తు చేశారు. జాప్యం జరుగుతున్నా కొద్దీ వ్యవ అంచనాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2017 జూన్ నాటికి భూసేకరణ సహా అన్ని సమస్యలు అధిగమించి ప్రాజెక్టు పూర్తిచేయాలని నిర్ణయించామని తెలిపారు. లెండి తొలి దశ రిజర్వాయర్‌ను జూన్ 2018 నాటికి పూర్తిచేసి క్రస్ట్ వరకు నీటి నిల్వ చేసేందుకు సహకరించాలని లేఖలో కోరారు. ప్రాజెక్టు వ్యయం, ఇతర సహకారం విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించేందుకు సిధ్దంగా ఉందని వెల్లడించారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top