తెలంగాణ ఏకైక బాహుబలి కేసీఆర్‌

తెలంగాణ ఏకైక బాహుబలి కేసీఆర్‌


ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి



హైదరాబాద్‌: తెలంగాణ ఏకైక బాహుబలి సీఎం కేసీఆర్‌ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. టీఆర్‌ఎస్‌ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొం డలో గురువారం ప్రగతి నివేదన సభ జరి గింది. ఈ సభలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఎవరూ సాటి రారన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింద న్నారు. రూ. 1.40 లక్షల కోట్ల బడ్జెట్‌లో సం క్షేమ రంగానికి అత్యధిక కేటాయింపులు చేశా రని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు నెలకు రూ.వెయ్యి, వికలాంగులకు నెలకు రూ. 1,500 పింఛన్‌ ఇస్తున్నామన్నారు.



రాష్ట్రంలో 40 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఒక్కటేనని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నెలకు ఇచ్చే రూ. 200 పింఛన్‌ ఏ మూలకూ సరిపోలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకులు కమీషన్లకు కక్కుర్తి పడి పేదల పొట్టలు కొట్టారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ నేతలు వారి పొట్టలు నింపుకొని పేదల సంక్షేమాన్ని విస్మరించారని దుయ్యబట్టారు. గర్భిణులు అవస్థలు పడుతూ ప్రసవించే వరకు కూడా కూలీ పని చేయాల్సి వస్తోందని గుర్తించిన సీఎం కేసీఆర్‌ వారికి రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తున్నా రన్నారు. ఆడపిల్ల జన్మిస్తే రూ.15 వేలు ఇవ్వడంతో పాటు పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు కేసీఆర్‌ కిట్‌ అందిస్తున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని అన్నారు.  కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆడబిడ్డల గురించి ఏనాడైనా ఆలోచించిందా అని ప్రశ్నించారు. అలాగే, మహిళా సంక్షేమం గురించి కూడా ఆలోచించ లేదన్నారు.



దళిత, గిరిజనుల అభివృద్ధికి స్పెషల్‌ ఫండ్‌

దళిత, గిరిజనుల అభివృద్ధికి దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్, ఎస్టీ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ అమలు చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ తనను పిలిపించుకుని అంబేడ్కర్‌ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్‌ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఆ మహానీయుడి 125 జయంతి ఉత్సవాలకు  గుర్తింపుగా 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేద్దామని చెప్పారని గుర్తు చేశారు. దీంతో పాటు ఇంకా ఏమైనా చేస్తే బాగుంటుందని అన్నప్పుడు తాను 125 గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేద్దామని కోరగా.. 500 గురుకులాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని కడియం తెలిపారు.



ఇంగ్లిష్‌ మీడియంలో పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నా మన్నారు. కేజీ టు పీజీ విద్య ఏదని విపక్షాలు అడుగుతున్నాయని, గురుకులాలు ఏర్పాటు చేసి, ఇంగ్లిష్‌ మీడియంలో నాణ్యమైన విద్య అందించడం లేదా అని ప్రశ్నించారు. పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. హాస్టల్‌ విద్యార్థులకు మెస్‌ చార్జీలు, కాస్మొటిక్‌ చార్జీలు పెంచడంతో పాటు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామన్నారు. 2019లోపు ప్రతీ ఇంటికి శుద్ధి చేసిన తాగు నీటిని అందించకపోతే ఓట్లు అడుగనని చెప్పిన దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్‌ అని అన్నారు.



కాంగ్రెస్‌ పార్టీ ఏనాడైనా ఇలాంటి సాహసం చేసిందా అని కడియం ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీకి స్థానం లేదని, కమ్యూ నిస్టులపై ప్రజలకు విశ్వాసం లేదని, బీజేపీకి గ్రామాల్లో పునాదులు లేవని, కాంగ్రెస్‌కు నాయకత్వం లేదని... తెలంగాణలో సీఎం కేసీఆర్‌కు ఎదురెవరూ లేరని కడియం శ్రీహరి అన్నారు. గర్వంతో వీగిపోకుండా అందరం కలసి టీఆర్‌ఎస్‌ పార్టీని పటిష్టం చేద్దామని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్‌ను నిండు మనసుతో ఆశీర్వదించాలని కడియం కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top