టీఆర్‌ఎస్‌తో రాజీ లేదు

టీఆర్‌ఎస్‌తో రాజీ లేదు - Sakshi


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌  

సాక్షి, హైదరాబాద్‌: అధికార టీఆర్‌ఎస్‌తో తమ పార్టీకి ఎలాంటి రాజీ లేదని, రాబోయే 3 నెలలపాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఉద్యమ కార్యాచరణను రూపొందించుకున్నట్లు బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌ ప్రకటించారు. ఎన్నికలకు ముందు, అ«ధికారంలోకి వచ్చాక టీఆర్‌ఎస్‌ చేసిన వాగ్దానాలు, ఇచ్చిన హామీల అమ లులో ఘోరంగా విఫలమైందన్నారు. రెండు పడకల ఇళ్లు, దళితులకు మూడు ఎకరాలు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, తండాలను గ్రామపంచాయతీలుగా మార్పు, రైతుల సంక్షేమం తదితర ముఖ్యమైన హామీల అమలును పూర్తిగా విస్మరించిందన్నారు.


రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఆలోచనలకు పూర్తి విరుద్ధంగా  ముస్లింలకు 12 శాతం మతపరమైన రిజర్వేషన్ల యోచనను కేసీఆర్‌ తీసుకు వచ్చారన్నారు. సోమవారం పార్టీ నాయకులు చింతా సాంబమూర్తి,  జి.మనో హర్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి  తదితరు లతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని గౌరవించకుండా తీసుకున్న ఈ నిర్ణయం ఆచరణ సాధ్యం కాదని తెలిసినా  ఓటు బ్యాంకు విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.  



మతపర రిజర్వేషన్లకు నిరసన

మతపరమైన రిజర్వేషన్లు, రైతు సమస్యలు, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సమస్యలపై  పోరాడాలని ఈ నెల 20, 21 తేదీల్లో భద్రాద్రిలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయించి నట్లు లక్ష్మణ్‌ తెలిపారు.  వీటిలో భాగంగా వచ్చేనెల 8, 9 తేదీల్లో జిల్లాస్థాయిల్లో సదస్సులు, 15–20 తేదీల మధ్య మండల స్థాయిలో వివిధ రూపాల్లో నిరసనలు, ఊరేగింపులు, సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి చివరల్లో అసెంబ్లీ ముట్టడి లేదా హైదరాబాద్‌లో పెద్ద కార్యక్రమాన్ని చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలియజేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top