వీరి ప్రాణాలు నిలపండి

వీరి ప్రాణాలు నిలపండి


ఆడుతూ.. పాడుతూ.. సంతోషంగా

 

గడపాల్సిన బాల్యం మంచానికే పరిమితమైంది. కూలీకి వెళ్తేనే జీవనం గడిచే పేద కుటుంబాల పిల్లలు పెద్ద జబ్బుతో బాధ పడుతున్నారు. డోర్నకల్ మండలం చిలుకోడుకు చెందిన సంపెట శ్రీనివాస్, పద్మ దంపతుల కూతురు దివ్య, అదే గ్రామ శివారులోని ఎర్రకుంటతండాకు చెందిన సర్వాన్, పద్మ దంపతుల కూతురు సింధు తలసేమియూ వ్యాధితో బాధపడుతున్నారు. పిల్లలకు రక్తం ఎక్కించేం దుకు నెలకు రూ.10 నుంచి 15 వేల వరకు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఈ వ్యాధి పూర్తిగా నయం కావాలంటే ఎముకల్లోని గుజ్జును మార్చాలని, అందుకు లక్షల రూపాయలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పారు. దాతల సాయం కోసం ఆ పేద కుటుంబాలు ఎదురుచూస్తున్నారుు.

 

పుస్తకాలు పట్టుకుని పాఠశాలకు వెళ్లాల్సిన వారు మంచానికే పరిమితమయ్యూరు. తోటి పిల్లలతో ఎంచక్కా ఆడి పాడాల్సిన వయస్సులో నరకయూతన అనుభవిస్తున్నారు. రక్తం ఎక్కిస్తేనే బతికే జబ్బు (తలసేమియూ)తో వారు నిత్యం దిగులు చెందుతున్నారు. అరుుతే మాయదారి రోగంతో మంచం  పట్టిన కంటి పాపలను చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.మానవతావాదులు తమ పిల్లల వైద్యం కోసం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. తలసేమియూ వ్యాధితో తల్లడిల్లుతున్న ఇద్దరు నిరుపేద బాలికల కన్నీటిగాథపై  ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

 

డోర్నకల్  : మండలంలోని చిలుకోడు శివారు ఎర్రకుంట తండాకు చెందిన మాలోత్ సర్వాన్, పద్మ దంపతుల కూతురు సింధు, చిలుకోడు గ్రామానికి చెందిన సంపెట శ్రీనివాస్, పద్మ దంపతుల కూతురు దివ్యలు కొన్ని సంవత్సరాల నుంచి తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. అరుుతే మాయదారి రోగంతో బాధపడుతున్న తమ కంటిపాపలను కాపాడుకునేం దుకు తల్లిదండ్రులు ప్రతీ నెలా హైదరాబాద్ విద్యానగర్‌లోని రెడ్‌క్రాస్ సంస్థకు తీసుకెళ్లి రక్తం ఎక్కించి తీసుకొస్తున్నారు. కాగా, నెలనెల ఇద్దరికి రక్తం ఎక్కిస్తుండడంతోపాటు మందుల ఖర్చుకు రూ. 10 వేల చొప్పున వెచ్చిస్తున్నారు. ఇదిలా ఉండగా, సింధుకు ప్రస్తుతం 20 రోజులకోసారి రక్తం ఎక్కించాల్సి వస్తోం దని తల్లిదండ్రులు సర్వాన్, పద్మలు తెలిపారు. పది రోజుల క్రితం సింధును హైదరాబాద్‌కు తీసుకెళ్లగా రక్తం లేదని రెడ్‌క్రాస్ ప్రతినిధులు చెప్పడంతో ఇంటికి తిరిగి వచ్చామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

 

రక్తం అందక నీరసం..

 సింధుకు పది రోజుల నుంచి రక్తం అందకపోవడంతో పూర్తిగా నీరసించి పోరుుందని తల్లిదండ్రులు విలపిస్తూ తెలిపారు. రక్త కణాలు బాగా తగ్గిపోవడంతో నడవలేని స్థితిలో మంచానికే పరిమితమైందని వారు చెప్పారు. ఇదిలా ఉండగా, దివ్యకు కూడా రక్తం దొరకకపోవడంతో శరీరం ఉబ్బి, తరచు జ్వరం వస్తోందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. కూలీ పనులు చేస్తేనే కుటుంబాన్ని పోషించుకునే తమ ఇళ్లలో పెద్దజబ్బు పీడిస్తోందని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాగా, తలసేమియా వ్యాధిని పూర్తిస్థాయిలో నయం చేయించాలంటే పిల్లల ఎముకల్లోని గుజ్జును తొలగించే ఆపరేషన్ చేయించాలని, ఇందు కోసం రూ. లక్షలు ఖర్చవుతాయని  వైద్యులు చెప్పారని సింధు, దివ్యల తల్లిదండ్రు లు చెబుతున్నారు.

 

 పిల్లలకు ప్రాణభిక్ష పెట్టండి.
.

 తలసేమియూతో బాధపడుతున్న తమ పిల్లల వైద్యం కోసం సాయం అందించాలని అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను, కలెక్టర్ ను కలిసినా ఎవరూ పట్టించుకోలేదని సింధు, దివ్య తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, దయూమయులు స్పందించి తమ పిల్లల వైద్య చికిత్స కోసం తమవంతు ఆర్థిక సాయం అందించి ప్రాణభిక్ష పెట్టాలని వారు చేతులెత్తి వేడుకుంటున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top