సాగునీటితో రైతుల ముఖాల్లో ఆనందం

సాగునీటితో రైతుల ముఖాల్లో ఆనందం - Sakshi

  • రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

  • కాంగ్రెస్‌ హయాంలో చెరువులు కబ్జా చేస్తే మేం పూడిక తీస్తున్నాం

  • సాక్షి, వికారాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘మిషన్‌ కాకతీయ’ ద్వారా కుంటలు, చెరువులకు మరమ్మతులు చేసి సాగునీటిని అందిస్తుండడంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోం దని రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. వికారాబాద్‌ జిల్లాలోని మోమిన్‌పేట, మర్పల్లి మండలాల్లో ఆయన మంగళవారం పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం రవాణాశాఖ మంత్రి పి.మహేం దర్‌రెడ్డితో కలిసి వచ్చారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిందని తెలుసుకొని వాటిని రద్దు చేసుకున్నారు. అనంతరం మోమిన్‌పేట్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. రబీలో పంటలకు నీరుండేదికాదని ప్రభుత్వం చెరువులు, కుంటలు తవ్వడం, ఉన్నవాటిని మరమ్మతులు చేయడంతో గత వర్షాకాలంలో కురిసిన వర్షాలతో నీరు పుష్కలంగా చేరిందన్నారు. దీంతో రబీలోనూ రైతులు పంటలు సాగుచేస్తున్నారన్నారు.



    కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు చెరువులు, కుంట లు కబ్జా చేసేవారని, తమ ప్రభుత్వం వాటిని కాపాడి పూడికలు తీస్తోందని చెప్పారు. నిండిన చెరువుల నీళ్లలో సీఎం కేసీఆర్‌ ప్రతిబింబం కనిపిస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కంది  గిట్టుబాటు కోసం రాష్ట్రంలో 95 కొనుగో లు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ఇప్పటికే 5 లక్షల మెట్రిక్‌ టన్నుల కందిని కొనుగోలు చేశామన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన 9 గంటల విద్యుత్‌ను అందజేస్తున్నామన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లా డుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. అన్నివర్గాల ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా బాగుండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్య క్రమంలో వికారాబాద్, చేవెళ్ల ఎమ్మెల్యేలు సంజీవరావు, కాలె యాదయ్య, ఎమ్మెల్సీలు పి.నరేందర్‌రెడ్డి, కె.యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top